శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం జడ్జి
తిరుపతి: తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిల్ ఆర్.దవే దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో జస్టిస్ అనిల్ ఆర్.దవే ఆయన కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. వారితో పాటు ఏపీ రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణ కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలోకి చేరుకున్న న్యాయమూర్తికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించి వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.












Click it and Unblock the Notifications