లడ్డూ వ్యవహారం లో సుప్రీం తాజా ఆదేశాలు..!!

లడ్డూ కల్తీ వ్యవహారం సుప్రీంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజా వివాదం పైన దాఖలైన పిటీషన్ పై సుప్రీం సీజే ధర్మాసనం విచారణ చేసింది. లడ్డూ కల్తీలో యానిమల్ ఫ్యాట్ .. రసాయనాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని పిటీషనర్ సుప్రీం కు నివేదించారు. దీని పైన స్పందించిన సుప్రీం కోర్టు జంతు కొవ్వు కలిసిందని చెప్పటానికి మీరు నిపుణులా అంటూ ప్రశ్నించింది. ఇప్పటికే ఈ వ్యవహారం పైన సీబీఐ విచారణ జరుగుతోంసీబీఐ దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోము అని స్పష్టం చేసిన సీజేఐ ధర్మాసనం.దని.. ఏవైనా ఆధారాలు ఉంటే సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది.

లడ్డూ వివాదం మరో సుప్రీంకు చేరింది. లడ్డూ వివాదంలో భాగంగా యానిమల్ ఫ్యాట్ కలిసిందని.. రసాయనాలతో లడ్డూ చేసారని జరుగుతున్న ప్రచారంపై మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐ దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోము అని స్పష్టం చేసింది. ఈ పిటీషన్ విచారణ సమయంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జంతు కొవ్వు కలిసిందని చెప్పటానికి మీరు నిపుణులా అంటూ ప్రశ్నించింది. ఈ కేసులో ఏమైనా ఆధారాలు ఉంటే సీబీఐకు ఇవ్వాలని సూచించింది. ఈ వ్యవహారంలో ఇలాంటి పిటీషన్లను అనుమతించే అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో అటు ఏపీ ప్రభుత్వం సైతం ఏకసభ్య కమిషన్ నియమించటంతో ఇప్పటికే విచారణ మొదలు పెట్టింది.

Supreme court key comments in Laddu Adulteration in Tirumala case directions for petitioner

ఏపీలో ఈ వ్యవహారం పైన రాజకీయంగా దుమారం చెలరేగింది. అధికార - విపక్షాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా ఎవరి వాదనలు వారు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం రిటైర్డ ఐఏఎస్ దినేశ్ కుమార్ తో నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణలో భాగంగా టీటీడీ అధికారుల నుంచి కావాల్సిన సమాచారం ఆరా తీస్తోంది.

అయితే.. ఇప్పుడు ఈ వివాదం కారణంగా ఇబ్బంది కర పరిస్థితులు ఏర్పడుతాయంటూ తాజాగా సుప్రీంలో దాఖలైన పిటీషన్ లో పిటీషనర్ పేర్కొన్నారు. అందులోని అంశాలను ప్రస్తావించిన సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో.. అటు సీబీఐ తుది నివేదిక... ఏపీ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తేల్చే అంశాలు ఈ వివాదంలో కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+