తిరుమల లడ్డూ కేసులో సుప్రీం కీలక తీర్పు, ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్..!!

లడ్డూ కల్తీ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దీంతో.. ఇప్పుడు సంచలనంగా మారిన లడ్డూ వివాదం కొత్త మలుపు తీసుకుంది. సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.తాజాగా ఏపీ ప్రభుత్వం ఇదే అంశం విచారణ కోసం ఏకసభ్య కమిటీ నియమించింది. ఇప్పుడు ఈ నిర్ణయం పైన సుబ్రమణ్య స్వామి సుప్రీం లో పిటీషన్ దాఖలు చేసారు. రేపు (సోమవారం) ప్రధాన న్యాయమూర్తి బెంచ్ విచారణ చేసింది. ప్రభుత్వం నియమించిన కమిటీ పైన సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. దీంతో.. ఈ వ్యవహారంలో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఈ తీర్పు కూటమి ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ గా మారనుంది.

లడ్డూ కల్తీ వ్యవహారంలో విచారణ చేసిన సిట్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇదే సమయం లో అసలైన దోషులను గుర్తించాలంటూ.. కూటమి ప్రభుత్వం తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ తో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేయడంపై అభ్యంతరం తెలుపుతూ సుబ్రమణ్య స్వామి సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ పైన విచారణ చేసిన సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది.

Supreme court pronounced the judgement over subramanian Swamy Petition on AP Govt committee to in Laddu case

లడ్డూ వ్యవహారంలో సిట్ తో పాటుగా ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ రెండూ కొనసాగుతాయని తేల్చి చెప్పింది. ఒక విచారణ మరో విచారణ పైన ప్రభావం చూపదని పేర్కొంది. సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్‌ను కొట్టివేసి, తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీకి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఆ కమిటీ విచారణకు మార్గం క్లియర్ అయింది.

లడ్డూ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సమయంలో సుప్రీం కీలక మార్గదర్శకాలు జారీ చేస్తూ.. విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. తాజాగా సిట్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో లడ్డూ సరఫరా.. కల్తీ.. జరిగిన పరిణామాల ను వివరించారు. కాగా, ఆ నివేదిక ఆధారంగా ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయంగా విమర్శలు - ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. అయితే.. ఇదే కేసులో ప్రభుత్వం ఏక సభ్య కమిటీని విచారణ కోసం నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ దినేశ్ కుమార్ కు విచారణ బాధ్యతలు అప్పగించింది. ఈ కేసులో చోటు చేసుకున్న పరిణామాలు.. సూత్రధారులను గుర్తించే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఏపీ ప్రభుత్వం ఇదే అంశం విచారణ కోసం ఏకసభ్య కమిటీ నియమించింది. ఇప్పుడు ఈ నిర్ణయం పైన సుబ్రమణ్య స్వామి సుప్రీం లో పిటీషన్ దాఖలు చేసారు. ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ఈ రోజు విచారణ చేసింది. తాము నియమించిన సిట్.. ఏపీ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీ రెండు విచారణ కొనసాగిస్తాయని.. ఒకరి విచారణ పైన మరొకరు ప్రభావం ఉండదని తేల్చి చెప్పింది. దీంతో.. ఇప్పుడు ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ కొనసాగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+