హైకోర్టు ఇంకెప్పుడు: ఏపీకి సుప్రీం ప్రశ్న, మూడేళ్లుగా అదే చెప్తున్నారని తెలంగాణ, కేంద్రం

న్యూఢిల్లీ: ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. హైకోర్టు ఎప్పుడు సిద్ధమవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దానికి ఏపీ తరఫు లాయర్ స్పందిసతూ డిసెంబర్ నాటికి హైకోర్టు సిద్ధమవుతుందని వెల్లడించారు.

ఏపీ హైకోర్టుపై మూడేళ్లుగా ఇదే మాట చెబుతున్నారని, కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల తరఫు లాయర్లు వ్యాఖ్యానించారు. భవనం ఎప్పుడు సిద్ధమవుతుందో అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను రెండు వారాల్లో అందించాలని జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది.

Supreme Court questions Andhra Pradesh about separate High Court

కాగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో హైకోర్టు విభజన చాలాకాలంగా పెండింగులో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలకు హైదరాబాదులోని హైకోర్టులోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును నిర్మించుకోవాల్సి ఉంది. భవనాల కోసం కేంద్రం నిధులు కూడా మంజూరు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+