వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి సురేష్ దంపతులపై అక్రమాస్తుల కేసు-సుప్రీంలో ముగిసిన వాదనలు-తీర్పు రిజర్వ్

|
Google Oneindia TeluguNews

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులపై దాఖలైన అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టులో ఇవాళ వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే తన వాదనలు వినిపించింది.

మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు ఆయన భార్య విజయలక్ష్మిపైనా సీబీఐ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఇందులో 120 మందికి పైగా సాక్షులను విచారణ చేసినట్లు సీబీఐ సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో తెలిపింది. 500 కు పైగా దస్తవేజులను పరిశీలించినట్లు వెల్లడించింది. దర్యాప్తు చివరి దశకు వచ్చిందని, .మూడు నెలలో దర్యాప్తు పూర్తి అవుతుందని సుప్రీంకోర్టు కు సీబీఐ తరపు న్యాయవాది.తెలిపారు. ఈ సమయంలో ప్రాథమిక విచారణ జరపమని చెప్పకండి అని సీబీఐ తరపు న్యాయవాది విజ్ఞపి చేశారు. విచారణ పూర్తి చేసిన తర్వాత ఛార్జ్ షీట్ నివేదిక అందజేస్తామని సుప్రీంకోర్టుకు సీబీఐ న్యాయవాది తెలిపారు. నివేదిక పరిశీలించి మీరు నిర్ణయం తీసుకోవచ్చని సీబీఐ తరపు న్యాయవాది ఐశ్వర్య బాతి తెలిపారు.

supreme court reserved verdict on disproportionate assets case on ap minister adimulapu suresh,wife

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు ఐఆర్ఎస్ అధికారి అయిన ఆయన సతీమణి విజయలక్ష్మిపై వచ్చిన ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ 2016లోనే కేసు నమోదు చేసింది. 2017లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.
అయితే దీన్ని సవాల్ చేస్తూ ఆదిమూలపు సురేష్ దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు సీబీఐ ఆదేశాలను తోసిపుచ్చింది. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్లో లోపాలు ఉన్నందున మరోసారి ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణలో వాదనలు పూర్తయ్యాయి. దీంతో అత్యున్నత న్యాయస్దానం తుది తీర్పును రిజర్వు చేసింది.

ఈ కేసులో సీబీఐ కక్షపూరితంగా తమపై కేసులు నమోదు చేసిందని ఆదిమూలపు సురేష్ దంపతులు వాదిస్తుండగా.. సీబీఐ మాత్రం మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి తుది ఛార్షిషీట్ దాఖలు చేస్తామని చెబుతోంది. ఆ తర్వాతే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలని కోరుతోంది. దీనిపై సుప్రీంకోర్టు త్వరలో నిర్ణయం ప్రకటించబోతోంది.

English summary
supreme court on today reseved its verdict on case against ap minister adimulapu suresh family's assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X