వైసీపీ మెడకు మరో ఉచ్చు? ఏపీ సర్కార్ నివేదిక కోరిన సుప్రీంకోర్టు..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన పలు అక్రమాలపై కూటమి సర్కార్ కొరడా ఝళిపిస్తోంది. అప్పట్లో అక్రమాలకు పాల్పడ్డ అధికారుల్ని ఇప్పటికే బదిలీలు చేయడంతో పాటు వారి స్ధానాల్లో సమర్ధులైన అధికారుల్ని నియమిస్తోంది.

అదే సమయంలో అక్రమాలపై వరుస విచారణలకు ఆదేశిస్తోంది. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు కూటమి సర్కార్ కు వైసీపీ తప్పిదాలను తవ్వితీసేందుకు తాజాగా మరో అవకాశం ఇచ్చింది.

supreme court seek fresh report on sand irregularities in past ysrcp regime in ap

రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో భారీగా అక్రమాలకు తెరతీసిన రంగాల్లో ఇసుక మైనింగ్ కూడా ఒకటి. దీనిపై అప్పట్లో ఎన్జీటీ విచారణ జరిపి రూ.100 కోట్ల మేర జరిమానా కూడా విధించింది. దీనిపై అప్పటి జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా తవ్వకాలకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. అంతే కాదు అప్పట్లో ఇసుక అక్రమాలపై విచారణ కూడా కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో అప్పటి అధికారులు ఇసుక తవ్వకాల్లో అక్రమాలే జరగలేదని ఇచ్చిన నివేదికతో క్షేత్రస్థాయి పరిస్ధితులు సరిపోలేదు.

దీంతో గత పాలనలో ఇసుక అక్రమాలపై వాస్తవ పరిస్ధితుల ఆధారంగా తాజా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు విచారణను ఆగస్టు 2కు వాయిదా వేసింది. ఆ లోపు ప్రభుత్వం అప్పట్లో ఇసుక తవ్వకాల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఏపీలో ప్రభుత్వం మారింది కాబట్టి దీనిపై ప్రభుత్వం అన్ని వివరాలు తెప్పించుకుని నివేదిక ఇస్తుందని ప్రభుత్వ లాయర్ సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనికి సుప్రీంకోర్టు అంగీకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+