విప్ ధిక్కారణ: కావలి ఛైర్‌పర్సన్ అలేఖ్యకు నోటీసు
హైదరాబాద్: నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ ఛైర్‌పర్సన్ అలేఖ్యకు భారత అత్యున్నత న్యాయస్ధానం సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది. గత ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అలేఖ్య ఛైర్మన్ పదవిని ఆశించారు.
అయితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చివరి క్షణాల్లో అలేఖ్యకు చైర్మన్ పదవిని ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో మరికొద్ది సేపట్లో ఛైర్మన్ ఎన్నిక జరుగుతుందనగా అలేఖ్య, మరో కౌన్సిలర్ వెంకటేశ్వర రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.

దీంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హైకోర్టుని ఆశ్రయించారు. విప్ ధిక్కారణపై పూర్తి విచారణ జరిపి ఎన్నికల అధికారి వెంటనే నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు కొన్ని రోజుల పాటు అలేఖ్య చైర్మన్‌గా కొనసాగాలంటూ స్టే ఇచ్చింది.
దీంతో ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. అనంతరం అలేఖ్యపై విచారణ జరిపి పూర్తి వివరాలు అందజేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో అలేఖ్య చైర్మన్‌గా కొనసాగడం కోర్టును ధిక్కరించడమే అంటూ ధర్మాసనం ధిక్కార నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications