స్పీకర్‌దే: జగన్‌కు షాకిచ్చిన సుప్రీం కోర్టు, భూమాకు ఊరట

విజయవాడ: సుప్రీం కోర్టులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం నాడు చుక్కెదురయింది. భూమా నాగిరెడ్డి, జలీల్ ఖాన్, ఆదినారాయణ రెడ్డి సహా ఇరవై మంది ఎమ్మెల్యేలు 2014లో వైసిపి నుంచి గెలిచి, ఇటీవల అధికార టిడిపిలో చేరారు.

దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్టు గడప తొక్కింది. తమ పార్టీ టిక్కెట్ పైన గెలిచి, సైకిల్ ఎక్కిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని వారు తమ పిటిషన్‌లో విజ్ఞప్తిచేశారు. ఈ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు తోసిపుచ్చింది.

Supreme Court suspends YSRCP petition

ఈ కేసులోని విషయాలు స్పీకర్ పరిధిలో ఉంటాయని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. అవసరమైత్ ఈ విషయమై తొలుత హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. కేసు విచారణను హైకోర్టు త్వరలోనే పూర్తి చేస్తుందనితాము నమ్ముతున్నందున, హైకోర్టుకు కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోవడం లేదన్నారు. సుప్రీం తీర్పు టిడిపిలో చేరిన వారికి తాత్కాలిక ఊరట అని చెప్పవచ్చు.

కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పైన వైసిపి నేతలు ఇటీవల ఏపీ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద రావుకు ఫిర్యాదు చేశారు. వైసిపి ఇచ్చిన నోటీసు నిబంధనల ప్రకారం లేదని సభాపతి దానిని తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సుప్రీం కోర్టులోను చుక్కెదురైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+