లడ్డు వివాదంలో సుప్రీం కీలక నిర్ణయం..!!

తిరుమల లడ్డు వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. కొద్దిరోజులుగా తిరుమలలో లడ్డు వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ పైన కీలక నిర్ణయం తీసుకుంది.

తిరుమల లడ్డు వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వివాదంలో నిజం నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని వైసిపి రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు అదే సమయంలో లడ్డు వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బిజెపి సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఈ రెండు పిటిషన్ల పైన సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.

Supreme court to hear tirumala laddu case on 30th of this month

తిరుమల లడ్డు వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు బెంచిని నిర్ణయించింది. జస్టిస్ బి ఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్ బెంచ్ కి ఈ కేసును కేటాయించారు. ఈనెల 30న సుప్రీంకోర్టు ఈ కేసును విచారించనుంది. ఆరోజున విచారించే కాజు లిస్టులో ఐటో నెంబర్ 63గా తిరుమల లడ్డు కేసు లిస్ట్ అయింది. సుబ్రహ్మణ్యస్వామి ఈ కేసులో స్వయంగా తన వాదనలు వినిపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ వివాదం పైన రాజకీయంగా పెద్ద ఎత్తున రగడ కొనసాగుతుంది.

ఏపీ ప్రభుత్వం లడ్డు వివాదం పైన ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసింది. ఈరోజు నుంచి తిరుమలలో సిట్ విచారణ ప్రారంభిస్తుంది. అటు ప్రతిపక్ష వైసిపి లడ్డు కలుషితం అనేది రాజకీయ ప్రేరేపిత కుట్రగా ఆరోపిస్తుంది. ఇప్పటికే ఈ వివాదం పైన జగన్ ప్రధాని మోడీ, సుప్రీం సీజేకు లేఖ రాశారు. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ వేల జరిగే పరిణామాల పైన ఆసక్తి కనిపిస్తుంది. విచారణకు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కీలకంగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+