చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై సుప్రీంకోర్టు తాజా నిర్ణయం..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ ఈ రోజు (గురువారం) విచారణకు రాగా తిరిగి ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని నిర్దేశించింది. ఇక, విచారణ పూర్తయిన క్వాష్ పిటీషన్ పైన తీర్పును దీపావళి సెలవుల తరువాత వెల్లడిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
సుప్రీంలో విచారణ : చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ పైన ఈ రోజు సుప్రీంలో విచారణ జరిగింది. గత నెలలో ఈ పిటీషన్ విచారణ వేళ సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు పై స్కిల్ కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన తీర్పు వెలువరించిన తరువాతనే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిలల్ పిటీషన్ పై విచారణ చేపడతామని జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది.

తదుపరి విచారణ ఈ రోజు (9వ తేదీ)కి వాయిదా వేసింది. దీంతో, ఈ రోజు సుప్రీం ధర్మాసనం ఫైబర్ కేసులో విచారణ వాయిదా వేస్తూ...ఈ నెల 30వ తేదీ వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది.
క్వాష్ తీర్పు పై క్లారిటీ : స్కిల్ కేసులో తీర్పు రిజర్వ్ కావటంతో జడ్జిమెంట్ గురించి ధర్మాసనం క్లారిటీ ఇఛ్చింది. గత నెల 17న స్కిల్ కేసులో సుప్రీం తీర్పు రిజర్వ్ చేయగా, తీర్పును దీపావళి సెలవుల తరువాత వెల్లడిస్తామని ఈ రోజున స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణకు వచ్చినప్పుడు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు గురించి ప్రస్తావన ఉంటుందని భావించారు.
అదే విధంగా సుప్రీం కోర్టు క్వాష్ పిటీషన్ పైన వాదనలు ముగిసాయని..దీపావళి సెలవుల తరువాత వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ నెల 11వ తేదీ నుంచి సుప్రీంకోర్టుకు వరుస సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు పూర్తయిన తరువాత సుప్రీం ద్విసభ్య ధర్మాసనం క్వాష్ పిటీషన్ పైన తీర్పు వెల్లడించనుంది.

కొనాసాగుతున్న ఉత్కంఠ : దీంతో, చంద్రబాబు పైన స్కిల్ కేసులో 17ఏ చుట్టూ వాదనలు జరిగాయి. చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. 17ఏ సవరణకు ముందే ఈ కేసు నమోదు అయిందని..విచారణ ప్రారంభమైందని సీఐడీ తరపు న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో 17ఏ కీలకం కావటంతో ఈ సాంకేతిక అంశం మొత్తం కీలకంగా మారుతోంది.
చంద్రబాబును పైన నమోదైన ఇతర కేసుల్లోనూ ఈ అంశం కీలకంగా మారుతుందనే వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పైన ఉన్న చంద్రబాబు రెగ్యుల్ బెయిల్ పిటీషన్ రేపు ( 10వ తేదీ) హైకోర్టులో విచారణకు రానుంది. మొత్తంగా ఈ రోజు సుప్రీం క్వాష్ పిటీషన్ పై తీర్పు ఎప్పుడునేది స్పష్టత ఇవ్వటంతో...హైకోర్టులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పైన కోర్టు నిర్ణయం కీలకంగా మారనుంది.












Click it and Unblock the Notifications