లడ్డూ వివాదంపై విచారణకు కేంద్రం కీలక నిర్ణయం..!?
దేశ వ్యాప్తంగా దుమారానికి కారణమైన తిరుమల లడ్డూ విషయంలో కేంద్రం నిర్ణయం ఏంటి. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీం పరిధిలో ఉంది. కేంద్రం ఈ వివాదంలో విచారణకు సంబంధించి కేంద్రం ఈ రోజు సుప్రీంకు తమ అభిప్రాయం స్పష్టం చేయాల్సి ఉంది. ఇటు రాష్ట్రంలో సెట్ ను తాత్కాలికంగా నిలిపివేసారు. దీంతో, కేంద్రం సీబీఐ విచారణకు సిద్దమని చెబుతుందా..లేదా కోర్టుకే నిర్ణయాధికారం వదిలేస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
తిరుమల లడ్డూ వివాదంలో నేడు సుప్రీం కోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. లడ్డూ వివాదం పైన ఉన్నత స్థాయి విచారణ చేయించాలంటూ దాఖలైన పిటీషన్ల పైన విచారణ సమయంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో ఈ వివాదం పైన సిట్ విచారణ ప్రారంభం కావటంతో ఆ స్థాయిలో విచారణ సరిపోతుందా, లేక మరో విచారణ వేయాలా అనేది సొలిసిటర్ జనరల్ అభిప్రాయం సుప్రీం కోరింది. ఈ రోజు మధ్నాహ్నం ఈ విషయం పైన కేంద్రం స్పష్టత ఇవ్వనుంది. ఈ వివాదం లో కేంద్రం ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వం సిట్ నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో, సిట్ కు అనుకూలంగా కేంద్రం తమ అభిప్రాయం చెప్పే అవకాశం లేదు. సీబీఐ విచారణకు కేంద్రం ముందుకు వస్తుందా అనేది సందేహంగానే కనిపిస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. దీంతో, సీబీఐ విచారణ విషయంలో కేంద్రం అనుకూలంగా తమ నిర్ణయం చెప్పే ఛాన్స్ తక్కువగా కనిపిస్తోందనే విశ్లేషణలు ఉన్నాయి. కానీ, కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన అంశం కావటంతో కేంద్రం సేఫ్ పొజీషన్ లో ఉండేందుకు తమ భాగస్వామ్య ప్రభుత్వం ఏపీలో ఉన్నా.. ఈ అంశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించినది కావటంతో సీబీఐకు ముందుకొచ్చే అవకాశం ఉందనేది మరో వాదన.
సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యలతో ఇప్పటికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీంతో.. కేంద్రం విచారణ పైన నిర్ణయాధికారం సుప్రీంకే వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన సుప్రీం స్పందించింది. ప్రభుత్వం తరపు న్యాయవాదికి సూచనలు చేసింది. దీంతో, ఇప్పుడు సుప్రీం కోర్టులో ఈ రోజు జరిగే పరిణామాలు..లడ్డూ విషయంలో కేంద్రం చెప్పే అభిప్రాయం..సుప్రీం కోర్టు తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications