మీరే ముఖ్య అతిథి.. తప్పక రావాలి: చంద్రబాబుకు మలయాళ నటుడు సురేష్ గోపీ ఆహ్వానం!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వెళ్లి, సచివాలయంలో చంద్రబాబును కలిసిన సురేష్ గోపీ, 2018 ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు తిరువనంతపురం సమీపంలోని తన సొంత గ్రామమైన కళ్లియార్ లో బనానా ఫెస్టివల్‌ జరగనుందని తెలిపా

అమరావతి: ప్రముఖ మలయాళ సినీ నటుడు సురేష్‌ గోపి తన స్వగ్రామంలో జరిగే బనానా ఫెస్టివల్ లో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వెళ్లి, సచివాలయంలో చంద్రబాబును కలిసిన సురేష్ గోపీ, 2018 ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు తిరువనంతపురం సమీపంలోని తన సొంత గ్రామమైన కళ్లియార్ లో బనానా ఫెస్టివల్‌ జరగనుందని తెలిపారు.

Suresh Gopi invites AP CM Chndrababu Naidu for Banana Fest

ఈ అరటి పండుగలో విద్యార్థులు, శాస్త్రవేత్తలు, అరటి రైతులు పాల్గొంటారని, దీనికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కోరినట్టు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను కూడా ఈ వేడుకకు ఆహ్వానిస్తామని సురేష్ గోపీ తెలిపారు. ఈ వేడుకలో 457 రకాల అరటి ఉత్పత్తులను ప్రదర్శిస్తారని ఆయన పేర్కొన్నారు.

డబ్బింగ్ సినిమాలతో సురేష్ గోపీ తెలుగు సినీ అభిమానులకు సుపరిచితుడే. ఆయన ధరించిన పోలీస్ పాత్ర ప్రధానంగా నడిచే పలు చిత్రాలు మలయాళం నుంచి తెలుగుకు అనువాదం కూడా అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+