కొత్త రైళ్లకు సురేష్ ప్రభు పచ్చజెండా: కెసిఆర్‌తో భేటీ (పిక్చర్స్)
హైదరాబాద్: రైల్వేలను ప్రవేటీకరించేది లేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. రైల్వేలో ప్రైవేటు విదేశీ పెట్టుబడులపై సికింద్రాబాద్‌లో జరిగిన జాతీయ సదస్సులో సురేష్‌ప్రభు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రైవేటు భాగస్వామ్యం, విదేశీ పెట్టుబడులతోనే రైల్వేల పురోభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన చెప్పారు.
అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. రైల్వే నెంబర్ 1 స్థానంలో ఉండాలన్నది మోదీ కల అన్నారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైల్వేలను మరింత ఆధునీకరించాలని సురేష్ ప్రభు అభిప్రాయపడ్డారు. కాగా, ఆయన సికింద్రాబాద్‌లో రెండు కొత్త రైళ్లను ప్రారంభించారు.
కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి చాంబర్లో భేటీ అయిన వీరిద్దరూ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు.

కొత్త రైళ్లు
రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు సికింద్రాబాదు నుంచి రెండు కొత్త రైళ్లను సోమవారంనాడు ప్రారంభించారు.

రెండు కొత్త రైళ్లు
సురేష్ ప్రభు ప్రారంభించిన రెండు కొత్త రైళ్లలో ఒకటి సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య, మరోటి నాదేండ్ - ఔరంగాబాద్ మధ్య నడుస్తాయి.

తిరుపతి- షర్డీ మధ్య
త్వరలోనే తిరుపతి - షిర్డీ మధ్య మధ్య కొత్త రైలు ప్రారంభిస్తామని మంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు.

పెండింగ్ ప్రాజెక్టులు చేపడుతాం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెండింగు ప్రాజెక్టులను త్వరలో పరిష్కరిస్తామని రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెప్పారు

రైల్వే లైన్లు పెంచాలి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైల్వే లైన్లను పెంచాల్సిన అవసరం ఉందని రైల్వే మంత్రి సురేష్ ప్రభు అభిప్రాయపడ్డారు.

కేంద్రం ఆధీనంలోనే..
రైల్వే శాఖ కేంద్రం ఆధీనంలోనే ఉంటుందని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు రైల్వే శాఖ సదస్సులో స్పష్టం చేశారు.

అగ్ర స్థానంలో ఉండాలన్నదే...
రైల్వే వ్యవస్థ అగ్రస్థానంలో ఉండాలన్నదే ప్రధాని నరేంద్ర మోడీ స్వప్నమని రైల్వే మంత్రి సురేష్ ప్రభు సదస్సులో అన్నారు.












Click it and Unblock the Notifications