Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీకి మరో చల్లటి కబురు- 3 రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!

ఏపీని మరోసారి భారీ వర్షాలు పలకరించబోతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. అలాగే మత్సకారులు కూడా వేటకు వెళ్లరాదని సూచించింది. ఆవర్తనం కారణంగా తీరం వెంబడి భారీగా ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపిలో మూడు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలోని అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

Surface Trough Effect AP Braces for Three Days of Moderate to Heavy Rains

ఎల్లుండి నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు. ఉపరితల ఆవర్తనం కారణంగా సముద్ర తీరం వెంబడి గంటకు 40 -60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వారు పేర్కొన్నారు. భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందు ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని, అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+