కూటమిలో పెరిగిపోతున్ప గ్యాప్..! పిల్లల ఆఫర్ కామెడీ: టీడీపీ ఆస్దాన సర్వేయర్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ రెండేళ్లలో కూటమిలో మూడు పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే ఉన్నట్లు పైకి కనిపిస్తున్నా అంతర్గతంగా గ్యాప్ పెరుగుతోందన్న విశ్లేషణలు వినిపిస్తూనే ఉన్నాయి. అదే సమయంలో చంద్రబాబు ఈ మధ్య ఎక్కువ పిల్లల్ని కంటే 30 వేలు ఇస్తా, 40 వేలు ఇస్తానంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. పిల్లల్ని కని ఆఫర్ తీసుకుంటాం సరే ఆ తర్వాత వాళ్లను పోషించేదెవరన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇవే అంశాల్ని ప్రస్తావిస్తూ టీడీపీ ఆస్థాన సర్వేయర్ గా పేరున్న ప్రవీణ్ పుల్లట (Praveen Pullata) తాజాగా ఓ ట్వీట్ చేశారు. దీంతో ఇది వైరల్ అవుతోంది.
టీడీపీ ఎమ్మెల్యేలకు, కార్యకర్తల మధ్య, టీడీపీ, జనసేన స్థానిక నేతల మధ్య చాలా అంటే చాలా గ్యాప్ ఉందని ప్రవీణ్ పుల్లట తాజాగా చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు. ముఖ్యంగా అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు , కార్యకర్తల్లో కూడా తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. మీకు (టీడీపీ/చంద్రబాబు) అందుతున్న రిపోర్టులు వాస్తవ దూరం ఏమో సరి చూసుకోవాలని సూచించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం మాదిరిగానే భ్రమల్లో ఉంటే కష్టమని ప్రవీణ్ తేల్చేశారు.

టీడీపీ ఎమ్మెల్యేలకు, కార్యకర్తల మధ్య,
— Praveen Pullata (@praveenpullata) May 16, 2026
టీడీపీ, జనసేన స్థానిక నేతల మధ్య
చాలా అంటే చాలా గ్యాప్ ఉంది. అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు , కార్యకర్తల్లో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది. మీకు అందుతున్న రిపోర్టులు వాస్తవ దూరం ఏమో సరి చూసుకోండి. గతంలో వైసీపీ ప్రభుత్వం మాదిరిగానే భ్రమల్లో…
కార్యకర్తల అసంతృప్తి.. ప్రజల్లో అసంతృప్తిగా మారకుండా చూసుకోండి. లేదంటే వచ్చే ఎన్నికల్లో కష్టమని సర్వేయర్ ప్రవీణ్ పుల్లట కూటమికి తేల్చిచెప్పేశారు. అంతటితో ఆగకుండా చంద్రబాబు ఎక్కువ పిల్లలు కంటే ప్రోత్సాహకాలు ఇస్తామన్న ప్రకటనపైనా విమర్శలు గుప్పించారు. కొసమెరుపు ఏంటంటే పిల్లలు కనండి.. డబ్బులిస్తాం అని నిజంగా పిలుపునిస్తే హాస్యాస్పదం అవుతుంది, జాగ్రత్త అని చంద్రబాబుకు హెచ్చరికలు పంపారు. మరి ఆయా అంశాల మీద చంద్రబాబు చర్యలు తీసుకుంటారా, నిర్ణయాల్ని సమీక్షించుకుంటారా లేదా అన్నది కాలమే తేల్చాల్సి ఉంది.














Click it and Unblock the Notifications