చంద్రబాబుకు సర్వే నిపుణుడి బిగ్ అలర్ట్..! ఆ రెండు ఘటనలపై..!

ఏపీలో కూటమి సర్కార్ ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకుంటోంది. ఇప్పటివరకూ చిన్న చిన్న లోపాలు ఉన్నా.. అంతిమంగా అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రభుత్వం పోటీ పడి పనిచేస్తోంది. అయితే తాజాగా చోటు చేసుకున్న రెండు ఘటనలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. ఈ ఘటనల విషయంలో ప్రభుత్వం సకాలంలో స్పందించినా, ఆ స్పందన విషయంలోనూ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీకి అనుకూలంగా ఉండే సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట కీలక సూచన చేశారు.

నాన్ పొలిటికల్ అండ్ రెస్పాన్సిబుల్ పోస్ట్ అంటూనే ఎక్స్ లో ప్రవీణ్ పుల్లట తాజాగా ఓ పోస్టు పెట్టారు. ఈ పోస్టులో ఆయన నేరుగా సీఎం చంద్రబాబును ఉద్దేశించి కొన్ని విషయాలు షేర్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న తుని అత్యాచార యత్నం, కందుకూరు హత్య విషయంలో ప్రభుత్వ స్పందన విషయంలో ప్రవీణ్ విశ్లేషణ చేశారు. చివరిగా సీఎం చంద్రబాబుకు ఆయన ఓ కీలక సూచన కూడా చేసారు. సీఎం చంద్రబాబు అలా ఉండకపోతే కష్టమని ప్రవీణ్ తేల్చేశారు.

survey expert Praveen pullata key suggestion to cm Chandrababu on tuni kandukuru incidents

సర్ పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పౌరునిగా స్పందించాల్సిన సమయం ఇదే. రాజకీయాలకు అతీతంగా పరిశీలించండి అంటూ ప్రవీణ్ ఎక్స్ లో పోస్టు పెట్టారు. తునిలో చిన్నారిపై అత్యాచారయత్నం! చాలా జుగుప్సాకరంగా ఉంది సర్. ఆడబిడ్డల తల్లిదండ్రులు భయపడుతున్నారని తెలిపారు. అలాగే కందుకూరులో హత్య.. ఇది మరీ దారుణం సర్.. లా ప్రకారం వెళ్ళాలి కానీ బాధితులకు పరిహారాలు ఏంటని ప్రశ్నించారు. శాంతి భద్రతలను మీరే హ్యాండిల్ చేస్తున్నారు.. మీరు కులాలు, పార్టీలకి అతీతంగా స్పందించకపోతే పౌరసమాజం ఒప్పుకోదు. కఠినంగా ఉండండి అంటూ సలహా ఇస్తూ ముగించారు.

survey expert Praveen pullata key suggestion to cm Chandrababu on tuni kandukuru incidents

రాష్ట్రంలో తాజాగా తునిలో ఓ సంక్షేమ హాస్టల్ బాలికపై టీడీపీ కౌన్సిలర్ గా చెప్పుకున్న నారాయణరావు అనే వ్యక్తి స్కూలు నుంచి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేస్తున్న వీడియోలు నిన్న వైరల్ అయ్యాయి. దీనిపై ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న మంత్రి నారా లోకేష్ కూడా తీవ్రంగా స్పందించి చర్యలకు ఆదేశించారు. అలాగే కందుకూరులో లక్ష్మీనాయుడు అనే కార్యకర్త హత్యపై స్పందించిన ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులకు భారీ ఎత్తున పరిహారాలు ప్రకటించింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇవే విషయాల్ని ప్రవీణ్ పుల్లట సీఎం చంద్రబాబుకు గుర్తుచేస్తూ అలర్ట్ కావాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+