సర్వేలు: కాపులు ఎటు వైపు 40 సీట్లపై చంద్రబాబు ప్లాన్ ఏమిటి?
అమరావతి: వచ్చే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో సంబంధం లేకుండా కూడా విజయం సాధిస్తుందని తెలియజేస్తున్నాయి.
Recommended Video

రెండు సర్వేల ఫలితాలను తెలుగుదేశం పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు ముందు నిర్వహించిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో వెల్లడించారు.

కచ్చితంగా టిడిపికి ఈ సీట్లు...
తెలుగుదేశం పార్టీకి 140 నుంచి 145 సీట్లు వస్తాయని సర్వేలో తేలినట్లు ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. అయితే కచ్చితంగా 125 నుంచి 130 సీట్లు వస్తాయని సర్వేల్లో తేలినట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఫలితాలు అనుకూలంగా ఉంటాయని సర్వేలు తేల్చినట్లు సమాచారం.

40, 45 సీట్లలో సిట్టింగులపై అసంతృప్తి
రాష్ట్రంలోని 40-45 సీట్లలో ప్రస్తుత శాసనసభ్యులపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్లు సర్వేలు తేల్చాయి. ఈ స్థానాల్లో చంద్రబాబు బి ప్లాన్ అమలు చేస్తారని అంటున్నారు. ఎన్నికల నాటికి ఆ స్థానాల్లోని ఎమ్మెల్యే పనితీరు మెరుగు కాకపోతే చురుగ్గా ఉన్న అభ్యర్థులను రంగంలోకి దింపి, సిట్టింగులను పక్కన పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే సిట్టింగు ఎమ్మెల్యేలకు తెలియజేసినట్లు సమాచారం.

సర్వేలు ఇలా చేయించారు...
రెండు జాతీయ సర్వే సంస్థలు రాష్ట్రంలో సర్వే నిర్వహించినట్లు సమాచారం. నోయిడా, బెంగళూరులకు చెందిన సంస్థలు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ వేయి మందిని ఎంపిక చేుకని 20 ప్రశ్నలతో కూడిన ఫార్మాట్‌ు అందించినట్లు తెలుస్తోంది. వయస్సు, విద్యార్హత, సామాజిక వర్గాల ప్రాతిపదికన ఈ సర్వేలు జరిగాయి.

50 శాతానికి పైగా ఓట్లతో...
తెలుగుదేశం పార్టీకి 50 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలినట్లు సమాచారం. తద్వారా 175 స్థానాలు ఉన్న రాష్ట్ర శాసనసభలో 125 నుంచి 130 స్థానాలను టిడిపి గెలుస్తుందని అంచనా వేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే అమరావతి పూర్తవుతుందని ప్రజలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. శాసనసభ్యులు, మంత్రుల కన్నా చంద్రబాబు ఎక్కువ కష్టపడుతున్నారని సర్వేలో తేలింది.

నిరుద్యోగ భృతిపై కసరత్తు...
నిరుద్యోగ భృతిపై ఆశలు పెట్టుకున్న యువకులు కాస్తా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మొత్తంగా యువత, మహిళా వర్గం టిడిపి అనుకూలంగా ఉన్నట్లు తేలింది. ఈ స్థితిలో నిరుద్యోగ భృతిపై కసరత్తు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు చెబుతున్నారు. త్వరలో ఆయన నిరుద్యోగ భృతిని ప్రకటిస్తారని చెబుతున్నారు. చంద్రన్న బీమా, పింఛన్లు రేషన్ సరుకులపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాపు సామాజివర్గం ఎటువైపు...
కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సర్వేల్లో తేలింది. కాపులను బీసీల్లో చేరుస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్యలు పనిచేశాయని అంటున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్లు సర్వేలు తేల్చాయి.

ఈ జిల్లాల్లో వైసిపి వైపు మొగ్గు
గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పరిస్థితి అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. దళితులు కొంత మేరకు జగన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అందుకే చంద్రబాబు దళిత తేజం అే కార్య్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంంది. బీసీల్లో మెజారిటీ కులాలు, వైశ్య వర్గంలో మెజారిటీ కూడా టిడిపి వైపే ఉన్నట్లు తేలింది.

కమ్మ సామాజికవర్గంలో వైసిపి వైపు...
కమ్మ సామాజిక వర్గంలో 20 నుంచి 30 శాతం మంది వైయస్సార్ కాంగ్రెసు వైపు మొగ్గు చూపుతున్నట్లు సర్వేల్లో తేలింది. కొంత మంది ప్రముఖులు, వారి తనయులు ఇతర కుటుంబ సభ్యుల కారణంగా పార్టీ ప్రతిష్ట దెబ్బ తినడమే దానికి కారణమని అంటున్నారు. అందువల్ల ఎంత పెద్దవారయినా అవసరమైతే వారిని కూడా పక్కన పెట్టాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు.

టిడిపిలోకి వచ్చిన వైసిపి ఎమ్మెల్యేలపై..
వైయస్సార్ కాంగ్రెసు నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన కొద్ది మందిపైనే సానుకూల వైఖరి వ్యక్తమవుతోందని సమాచారం. వైసిపి నుంచి 22 మంది శాసనసభ్యులు టిడిపిలోకి ఫిరాయించారు. వారిలో భూమా అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి మంత్రి పదవులు పొందారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు జాగ్రత్తగా వ్యవహరించాలని అనుకుంటున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications