• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గుంటూరు జిల్లా వాసికి అరుదైన గౌరవం...ఐఈఎ అధ్యక్షుడిగా సూర్యదేవర మహేంద్రదేవ్‌

|

గుంటూరు: గుంటూరు జిల్లా ఖ్యాతిని మరో మేధావి దేశవ్యాప్తంగా ఇనుమడింప చేశాడు...తండ్రి రచ్చ గెలిస్తే కుమారుడు ఇంట గెలిచాడు. తండ్రి ప్రముఖ సాహితీవేత్తగా, అంతర్జాతీయ చిత్రకారుడుగా ప్రపంచ ప్రసిద్ది చెందితే, ఆయన కుమారుడు ఆర్థికవేత్తగా దేశంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. తద్వారా తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు...ఇంతకీ ఆయన ఎవరంటే...ఐఈఎ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సూర్యదేవర మహేంద్రదేవ్...సన్నాఫ్ సూర్యదేవర సంజీవ్‌దేవ్‌...

ఆహారం మీద ఖర్చును మాత్రమే తీసుకుని పేదరికాన్ని అంచనా వేయడం సరైంది కాదని తేల్చి చెప్పిన ఆంధ్రా మేథావి...పేదరికాన్ని అంచనా వేసే కమిటీలో సభ్యుడిగా ఉన్నప్పుడే అప్పుడు ఛైర్మన్ రంగరాజన్‌కి స్పష్టం చేసిన ఆర్థికవేత్త మహేంద్రదేవ్. పావర్టీని అంచనా వేసేందుకు మనిషి దైనందిన జీవితంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులు గమనిస్తూ వ్యక్తి ఆహార వ్యయంతో పాటు ఇతర ఖర్చులు బాగా పెరిగాయన్న విషయాన్ని ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని నొక్కివక్కాణించిన మానవతావాది.

ఆహార ఖర్చుతో పాటు మొబైల్ ఛార్జీలు, విద్య, వైద్యం ఖర్చులు కూడా అంచనా వేసి తీరాలని ఖరాఖండిగా చెప్పిన నవనాగరికుడు. ఆయనే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడికి చెందిన మహేంద్రదేవ్‌. ప్రస్తుతం జరుగుతున్నఐఈఎ సదస్సులో ఇండియన్‌ ఎకనమిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

 స్వస్థలం ఎక్కడంటే...

స్వస్థలం ఎక్కడంటే...

సూర్యదేవర మహేంద్రదేవ్ స్వస్థలం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి. తండ్రి ప్రఖాత్య సాహితీవేత్త, అంతర్జాతీయ చిత్రకారుడు సూర్యదేవర సంజీవ్‌దేవ్‌ , తల్లి సూర్యదేవర మహేంద్రదేవ్,తల్లి సులోచనాదేవి‌. ప్రాథమిక విద్యను తుమ్మపూడిలో, ఆరు, ఏడు తరగతులను చిలువూరులోని కేవీఎస్‌ హైస్కూలులో, పదోతరగతి వరకు రేవేంద్రపాడు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదివారు.

 ఉన్నత విద్య...

ఉన్నత విద్య...

తెనాలిలో ఇంటర్మీడియట్‌, విజయవాడ లయోలాలో బీఏ పూర్తి చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్థాపించిన సంవత్సరమే ఆయన ఎంఏ చేశారు. ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు.

ఆర్థికశాస్త్రంలోదిట్ట...

ఆర్థికశాస్త్రంలోదిట్ట...

వ్యవసాయాభివృద్ధి, పేదరిక నిర్మూలన, ఆహారభద్రత, ఉపాధి కల్పన వంటి అంశాల్లో 100కు పైగా పరిశోధనాత్మక వ్యాసాలు రాశారు. ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌ ఇన్‌ ఇండియా, అగ్రికల్చర్‌ పావర్టీ అండ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌' పేరుతో ఆయన రాసిన వ్యాసాలు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ పత్రికల్లో ప్రచురించారు.

 ప్రస్థానంలో మైలురాళ్లు...

ప్రస్థానంలో మైలురాళ్లు...

అంతర్జాతీయ సంస్థలైన వరల్డ్‌బ్యాంక్‌, యూఎన్‌డీపీ, యునెస్కో, ఐఎల్‌వో తదితర సంస్థలకు ఆయన సలహాదారుగా, కన్సల్టెంట్‌గా ఉన్నారు.

మహేంద్రదేవ్‌ రాసిన ‘పర్స్ప్‌క్టివ్స్‌ ఆన్‌ ఈక్విటబుల్‌ డెవలప్‌మెంట్‌' పుస్తకాన్ని గత ఏడాది ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు.

రంగరాజన్‌ కమిటీలో, మాంటెక్‌ అహ్లూవాలియా కమిటీలో సభ్యునిగా ఉన్న ఆయన 2008-10 వరకూ కేంద్ర వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక సంఘం ఛైర్మన్‌గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి దీనికి ఛైర్మన్‌గా ఎన్నికైన ఒకే ఒక వ్యక్తి ఆయన.కేంద్ర వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక సంఘం ఛైర్మన్‌గా ఉన్న సమయంలో దిగుబడి ఖర్చుకు మద్దతు ధరకు వ్యత్యాసం ఉందని గమనించిన ఆయన వరికి 2008లోనే క్వింటా ధర రూ. 1000గా మద్దతు ధర ప్రకటించి రైతుల మన్నన అందుకున్నారు.

 గతంలో హోదాలు..ప్రస్తుతం...తాజాగా...

గతంలో హోదాలు..ప్రస్తుతం...తాజాగా...

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌, సోషల్‌ స్టడీస్‌కు పదేళ్లు డైరెక్టర్‌గా పనిచేశారు. రిజర్వుబ్యాంక్‌ ఉపకులపతి స్థాయికి దాదాపు సమానమైన ముంబైలోని ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ సైన్స్‌ సంస్థకు ప్రస్తుతం ఉపకులపతిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇండియన్‌ ఎకనమిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

 ఏఎన్‌యూ పూర్వ విద్యార్థి

ఏఎన్‌యూ పూర్వ విద్యార్థి

మహేంద్రదేవ్‌ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి కూడా. మహేంద్ర దేవ్‌ ఏఎన్‌యూ నుంచి ఎంఏ ఎకనమిక్స్‌లో పీజీ చేశారు. అనంతరం దిల్లీలో కేఎల్‌ కృష్ణారావు ఆధ్వర్యంలో పీహెచ్‌డీ చేశారు. దేవ్‌ ఐఈఏ ఛైర్మన్‌గా ఎంపికవ్వటం పట్ల ఆయనకు పాఠాలు చెప్పిన గురువు ఆచార్యుడు రాజు సంతోషం వ్యక్తం చేశారు. ఏఎన్‌యూ వీసీ ఆచార్య రాజేంద్రప్రసాద్‌ ఈ సందర్భంగా మహేంద్రదేవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్‌ ఎకనమిక్‌ అసోసియేషన్‌(ఐఈఏ) శతాబ్ది వేడుకలు ఈ ఏడాది ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ప్రాంగణంలో జరుగగా ఈ సదస్సును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించిన సంగతి తెలిసిందే...

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Suryadevara Mahendradev elected as president of the Indian Economic AssociationIEA is one of the most important associations of professional economists, and has been influential in shaping global economic policy and research.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more