రేప్ బాధితురాలితో రాజీపడ్డ టీడీపీ ఎమ్మెల్యే..! ఏం జరిగిందంటే..?

ఏపీలో కూటమి సర్కార్ అధికారం చేపట్టాక సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై వచ్చిన రేప్, లైంగిక వేధింపుల ఆరోపణలు తలనొప్పిగా మారాయి. దీంతో టీడీపీ నుంచి ఎమ్మెల్యే ఆదిమూలంపై వేటు పడింది. ఆ తర్వాత బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. అదే సమయంలో ఆమె హైకోర్టును కూడా ఆశ్రయించింది. అయితే అనూహ్య పరిణామాల మధ్య ఎమ్మెల్యే ఆదిమూలంతో ఆమె రాజీపడ్డారు.

టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై బాధితురాలు దాఖలు చేసిన కేసుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఇరుపక్షాల లాయర్లు హైకోర్టుకు అసలు విషయం చెప్పారు. తమ క్లయింట్లు ఇద్దరూ కోర్టు బయట రాజీ పడ్డారని వెల్లడించారు. దీంతో కోర్టు బయట వీరిద్దరూ సమస్య పరిష్కరించునేందుకు వీలుగా పిటిషన్ ను డిస్పోజ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో నెల రోజులుగా ఈ వ్యవహారంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న ఆదిమూలానికి భారీ ఊరట లభించింది.

suspended tdp mla koneti adimulam settled issue with rape victim

అయితే కోనేటి ఆదిమూలం తన బాధితురాలితో ఎలా సెటిల్ చేసుకున్నారనేది మాత్రం తెలియరాలేదు.అలాగే గతంలో రేప్ ఆరోపణలు రాగానే వీడియో ఆధారంగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన టీడీపీ ఇప్పుడు దాన్ని ఎత్తేస్తుందా లేదో కూడా చూడాల్సి ఉంది. ఈ వివాదంపై టీడీపీ నిజనిర్ధారణ చేస్తున్నట్లు గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు. ఇప్పుడు బాధితురాలితో రాజీ నేపథ్యంలో సస్పెన్షన్ పై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+