రఘురామ అనర్హత వేటుపై సస్పెన్స్- నేటితో ముగిస్తున్న గడువు-ఏం జరగబోతోంది ?
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు కోసం వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు గడువు ఇవాళ్టితో ముగియబోతోంది. దీంతో రఘురామరాజు వివరణ ఇస్తారా ? ఇస్తే అందులో ఏం చెప్పబోతున్నారు ? మరింత గడువు కోరే అవకాశముందా ? అదే జరిగితే పార్లెమంటులో ఒత్తిడి పెంచుతామన్న వైసీపీ తమ నిర్ణయాన్ని అమల్లో పెడుతుందా ? ఇలా ఎన్నో ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం లభించబోతోంది.

రఘురామ డెడ్ లైన్ ముగింపు
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు విషయంలో లోక్ సభ స్పీకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఆయనకు విధించిన 15 రోజుల గడువు నేటితో పూర్తి కాబోతోంది. ఈ నెల 15న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు నోటీసులు జారీ చేశారు. వీటిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. ఈ వివరణ ఆధారంగానే ఆయనపై వైసీపీ కోరుతున్న విధంగా అనర్హత వేటు వేయాలా వద్దా అన్న విషయంపై లోక్ సభ స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో రఘురామకృష్ణంరాజు ఇచ్చే వివరణ ఉత్కంఠ రేపుతోంది.

జోరు పెంచిన రఘురామ
అనర్హత వేటుపై లోక్ సభ స్పీకర్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు జోరు పెంచారు. వైసీపీపై దాడిని ఆయన కొన్నిరోజులుగా తీవ్రతరం చేశారు. ముఖ్యంగా జగన్, విజయసాయిరెడ్డి, సజ్జలను టార్గెట్ చేస్తూ రఘురామరాజు చేస్తున్న దాడి పతాకస్దాయికి చేరింది. తనపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ ఇచ్చిన నోటీసులకు ప్రతిగా వీరిని టార్గెట్ చేస్తున్న రఘురామ... వారిపై ఉన్న కేసులతో పాటు మిగతా అంశాల్ని తెరపైకి తెస్తున్నారు. దీంతో వైసీపీ నుంచి ఎలాంటి స్పందనా లేకుండా పోతోంది.

మరింత గడువు కోరతారా ?
లోక్ సభ స్పీకర్ ఇచ్చిన అనర్హత నోటీసులకు సమాధానం ఇచ్చే విషయంలో రఘురామకృష్ణంరాజు పూర్తి క్లారిటీగానే ఉన్నట్లు తెలుస్తోంది. తనపై అనర్హత వేటుకు వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులో అంశాలకు కౌంటర్లు సిద్దం చేసుకున్న రఘురామ వాటిని ఇవాళ లోక్ సభ స్పీకర్ కు పంపే అవకాశముంది. అలా కుదరని పక్షంలో చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు ఏవైనా సంభవిస్తే నోటీసులపై వివరణ ఇచ్చేందుకు స్పీకర్ ను మరింత గడువు కోరే అవకాశాలూ లేకపోలేదు. అదే జరిగితే స్పీకర్ నిర్ణయం కూడా కీలకంగా మారనుంది.

అన్నింటికీ సిద్ధంగా వైసీపీ
రఘురామకృష్ణంరాజుకు లోక్ సభ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులపై వివరణ ఇస్తే తమ తరఫున కూడా వివరణ ఇచ్చి సాధ్యమైనంత త్వరగా ఈ వ్యవహారం తేల్చేయాలని వైసీపీ పట్టుదలగా ఉంది. అలా కుదరని పక్షంలో రఘురామరాజు మరింత గడువు కోరితే మాత్రం పార్లమెంటులో నిరసనలు చేపట్టడం ద్వారా స్పీకర్ పై ఒత్తిడి పెంచేందుకు కూడా వైసీపీ ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై సంకేతాలు ఇచ్చేశారు. రఘురామపై ఈ సమావేశాల్లోనే ఎలాగైనా వేటు వేయించేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ... ఆగస్టు 23న పార్లమెంటు ముగిసేలోపు వేటుకు పట్టుబట్టే అవకాశాలున్నాయి.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications