AP Schemes: ఏపీలో ఆ 14 వేల కోట్ల సంక్షేమ పథకాల నిధుల విడుదల ఎప్పుడు ?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భారీ ఎత్తున చర్చకు కారణమైన రూ.14 వేల కోట్ల సంక్షేమ పథకాల నిధుల విడుదల పోలింగ్ ముగియగానే మూలనపడిపోయింది. విద్యాదీవెన, రైతు భరోసాతో పాటు పలు పథకాల లబ్దిదారులకు ఇవ్వాల్సిన రూ.14 వేల కోట్ల నిధులు ప్రభుత్వ ఖజానాలో ఉన్నప్పటికీ అవి విడుదలకు నోచు కోవడం లేదు. ఎన్నికల పోలింగ్ కు ముందు వాటి విడుదల కోసం కోర్టుల వరకూ వెళ్లిన ప్రభుత్వం.. ఇప్పుడు పోలింగ్ ముగిసినా వాటిని విడుదల చేయకపోవడం చర్చనీయాంశమవుతోంది.

రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే అంటే ఈ ఏడాది జనవరిలోనే ఈ రూ.14 వేల కోట్ల సంక్షేమ పథకాల నిధుల విడుదల కోసం జగన్ సర్కార్ బటన్లు నొక్కేసింది. అయితే నిధులు మాత్రం మే నెల వరకూ జమ చేయలేదు. వీటిని సరిగ్గా ఎన్నికల పోలింగ్ కు నాలుగు రోజుల ముందు విడుదలకు సిద్దమైంది. ముందే బటన్లు నొక్కిన నిధులు కాబట్టి విడుదలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించింది. కానీ అక్కడే విపక్షాలు అడ్డుకున్నాయి. ఈసీకి ఫిర్యాదులు చేశాయి.

suspense over rs 14000 cr welfare schemes funds release in ap amid politics

దీంతో రూ.14 కోట్ల సంక్షేమ పథకాల నిధుల విడుదలకు పోలింగ్ కు ముందు తొందరేం వచ్చిందని ఈసీ ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేదు. దీంతో హైకోర్టుకు వెళ్లినా ఊరట దక్కలేదు. ఎన్నికల పోలింగ్ తర్వాత రోజు అంటే 14వ తేదీన నిధులు విడుదల చేసుకోవచ్చని ఈసీ, హైకోర్టు తేల్చిచెప్పేశాయి. దీంతో 14వ తేదీన నిధులు లబ్దిదారుల ఖాతాల్లో పడతాయని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఇవాళ 16వ తేదీ వచ్చేసినా నిధులు మాత్రం విడుదల కాలేదు.

మరోవైపు ఖజానాలో ఉన్న ఈ నిధుల్లో నుంచి పెండింగ్ బిల్లులు క్లియర్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. నిన్న ఐదు బిల్లుల్ని క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. దీన్ని అడ్డుకోవాలంటూ విపక్షాలు గవర్నర్ ను ఆశ్రయించాయి. దీంతో స్పందించిన గవర్నర్ ప్రభుత్వానికి తగు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బిల్లుల క్లియరెన్స్ కు అడ్డుకట్ట పడినట్లు భావిస్తున్నారు. అయితే సంక్షేమ పథకాల లబ్దిదారుల ఖాతాల్లో ఈ డబ్బులు ఎప్పుడు పడతాయన్న దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఆయా పథకాల నిధుల కోసం లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+