చంద్రబాబు మేధోమథనం అందుకే: జగన్, సీమకు అన్యాయమని ఎమ్మెల్యేలు
హైదరాబాద్: ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మేధోమథనం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ నేతలతో హైదరాబాదులోని లోటస్‌పాండులో వైయస్ జగన్ శనివారం సమీక్ష జరిపారు.
పారిశ్రామిక రాయితీలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతానికే కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరడం దారుణమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనశభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీ విమర్శించారు.

తెలుగుదేశం ప్రజా ప్యతిరేక పాలనను ప్రజల్లోనే ఎండగడుతామని వారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, చేతలు శూన్యమని వారు విమర్శించారు. టిడిపి పాలనలో రాయలసీమకు పూర్తిగా అన్యాయం జరుగుతోందని వారు ఆరోపించారు.
తమ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని పార్టీ నేతలకు వైయస్ జగన్ సూచించారు. పార్టీకి చెందిన ఎంపి బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications