స్వతంత్ర అభ్యర్దిగా పిఠాపురం బరిలో వర్మ - పవన్ వాట్ నెక్స్ట్..!?

ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. గోదావరి జిల్లాల్లో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. జనసేనాని పవన్ పిఠాపురం నంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే టీడీపీ నేత వర్మ మద్దతు దారులు ఆందోళనకు దిగారు. వర్మకు టీడీపీ నాయకత్వం నుంచి పిలుపు వచ్చింది. మూడు మండలాల్లోని తన మద్దతు దారులతో వర్మ సమావేశమయ్యారు. కీలక నిర్ణయం ప్రకటనకు సిద్దమయ్యారు. దీంతో, పవన్ ఏం చేయబోతున్నారు.

వర్మ కీలక భేటీ : ఈ సారి ఎన్నికల్లో గోదావరి రాజకీయం కీలకంగా మారుతోంది. తమ పొత్తుతో గోదావరి జిల్లాల్లో వైసీపీని పూర్తిగా దెబ్బ తీయాలని ప్రణాళికలు సిద్దం చేసాయి. ఈ సమయంలోనే కాపు నేతల పైన వైసీపీ గురి పెట్టింది. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ వైసీపీలో చేరారు. ఇక, పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్దిగా వంగా గీత పోటీ చేస్తున్నారు. ఇప్పుడు పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ వర్మ తన అనుచర వర్గంతో సమావేశమయ్యారు. ఇప్పటికే వర్మను స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. కార్యకర్తలతో సమావేశం తరువాతనే చంద్రబాబును కలవాలని వర్మ భావించారు. అయితే, అనుచర వర్గం నుంచి వస్తున్న ఒత్తిడితో వర్మ స్వతంత్ర అభ్యర్దిగానే బరిలోకి దిగటం ఖాయమని నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది.

https telugu oneindia com news andhra-pradesh telangana-high-court-admit-dastagiri-plea-seeking-ys-avinash-reddy-bail-cancellation-378939 html

పోటీలో నిలుస్తారంటూ : 2014 ఎన్నికల సమయంలోనూ వర్మ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. అప్పుడు స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసి కూటమి పైన విజయం సాధించారు. పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో కాపు సామాజికవర్గం సుమారుగా 30 శాతం వరకు ఉండగా, మాలలు 12 శాతం, శెట్టి బలిజలు, చేనేతలు బెస్తలు సుమారు 10 శాతం చొప్పున ఉన్నారు. ఆ తర్వాత స్థాయిలో రెడ్డి, యాదవ తూర్పు, తూర్పు కాపులు , మాదిగలు గణనీయ స్థాయిలో ఉన్నారు. పవన్ కు మద్దతుగా మెజార్టీ కాపు వర్గం నిలిచే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అయితే, వర్మ నిర్ణయం ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ కానుంది. 2014 తరహాలోనే పోటీ చేసి ఫలితం రిపీట్ చేద్దామనేది వర్మ మద్దతు దారులు డిమాండ్ గా కనిపిస్తోంది.

రాజకీయ ఉత్కంఠ : ఈ సమావేశం వేళ వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇక తన భవిష్యత్ పై నిర్ణయం పిఠాపురం ప్రజల చేతుల్లోనే అంటూ పోస్టు చేసారు. తాను అన్ని వేళలా అందుబాటులో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఎందుకనో స్థానికుడిని అయిన తనకు అన్యాయం చేసారంటూ ఆ పోస్టులో పేర్కాన్నారు. తన పైన వస్తున్న ఒత్తడి మేరకు వర్మ స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేస్తే పవన్ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు చర్చకు కారణం అవుతోంది. వర్మ స్వతంత్ర అభ్యర్దిగా బరిలోకి దిగితే ఇక చంద్రబాబును కలిసే అవకాశం ఉండదని భావిస్తున్నారు. దీంతో, ఇప్పుడు వర్మ తీసుకొనే నిర్ణయం పైన టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీల్లోనూ ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+