Warning: చెత్త వేస్తున్నారా? కరెంట్, నీళ్లు కట్.. సుప్రీం సీరియస్ వార్నింగ్!

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న చెత్త సమస్యపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘన వ్యర్థాల నిర్వహణ అనేది కేవలం పారిశుధ్య కార్మికుల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతీ ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని స్పష్టం చేసింది. చెత్త నిర్వహణ నిబంధనలను బేఖాతరు చేసే బల్క్ వేస్ట్ జనరేటర్లపై ఉక్కుపాదం మోపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. క్రమశిక్షణ తప్పి పర్యావరణానికి హాని కలిగిస్తే సహించేది లేదని దేశవ్యాప్తంగా అధికారులను హెచ్చరించింది.

సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. షాపింగ్ మాల్స్, స్టార్ హోటళ్లు, పెద్ద ఆస్పత్రులు, వాణిజ్య సముదాయాలు, భారీ హౌసింగ్ సొసైటీలు తమ ప్రాంగణాల్లో ఉత్పత్తయ్యే చెత్తను బాధ్యతాయుతంగా వర్గీకరించాల్సిందే. తడి, పొడి చెత్తను వేరు చేసి సురక్షితంగా డిస్పోజ్ చేయని పక్షంలో ఆయా సంస్థలకు దిమ్మతిరిగే షాక్ తగలనుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలు పాటించకపోతే సదరు మాల్స్, ఆస్పత్రులకు ఇచ్చే నీరు, విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయాలని డిస్ట్రిక్ట్ కలెక్టర్లను ఆదేశించింది. సక్రమంగా చెత్తను నిర్మూలిస్తున్నామని సర్టిఫికెట్ ఇచ్చే వరకు ఈ కోతలు అమల్లోనే ఉంటాయని స్పష్టం చేసింది.

Supreme Court Directs Power and Water Cut for Malls and Hospitals Over Poor Solid Waste Management
రూ.20 కోసం 30 ఏళ్ల న్యాయపోరాటం.. చివరికి సుప్రీంకోర్టులో బిగ్ ట్విస్ట్!
రూ.20 కోసం 30 ఏళ్ల న్యాయపోరాటం.. చివరికి సుప్రీంకోర్టులో బిగ్ ట్విస్ట్!

ఎవరెవరు ఈ పరిధిలోకి వస్తారంటే?

రోజుకు 100 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేసే సంస్థలు, 20 వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ వైశాల్యం ఉన్న ప్రాంగణాలు లేదా రోజుకు 40 వేల లీటర్ల కంటే ఎక్కువ నీటిని వినియోగించే ప్రదేశాలను 'బల్క్ వేస్ట్ జనరేటర్లు'గా వర్గీకరించారు. ప్రతీ జిల్లా కలెక్టర్ తమ పరిధిలోని ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలను గుర్తించి, నిబంధనలు పాటించకపోతే ఎదురయ్యే తీవ్ర పరిణామాలను వారికి ముందే వివరించాలని కోర్టు స్పష్టం చేసింది.

22 ఏళ్ల నరకం.. సుప్రీం కోర్టు తీర్పు చూసి కన్నీళ్లు..
22 ఏళ్ల నరకం.. సుప్రీం కోర్టు తీర్పు చూసి కన్నీళ్లు..

సాంకేతికతతో కంటికి రెప్పలా నిఘా!

చెత్త నివారణ చర్యలను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు ఒక ప్రత్యేక పర్యవేక్షణ కమిటీని నియమించింది. నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు జీయో-ట్యాగింగ్ ఫోటోలను సేకరించాలని, ప్రతీ నెలా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా రిపోర్టులను అందజేయాలని సూచించింది. రైల్వే శాఖ, రక్షణ శాఖ, పబ్లిక్ సెక్టార్ సంస్థలు కూడా ఈ నియమాలను కచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. 'నేను చెత్త వేస్తాను కానీ బాధ్యత తీసుకోను' అనే మనస్తత్వాన్ని సమాజం వీడాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+