శ్రీకాళహస్తిలో వివాదాస్పద గురువు నిత్యానంద, రంజిత: మీడియాతో దురుసు
చిత్తూరు: వివాదాస్పద గురువు స్వామి నిత్యానంద గురువారం శ్రీకాళహస్తి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆయనతోపాటు శిశ్యురాలు రంజిత కూడా శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్నారు.

కాగా, ఈ సందర్భంగా నిత్యానంద అనుచరులు చేసిన హంగామా వివాదాస్పదమైంది. నిత్యానంద, రంజితలను చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిని వారు అడ్డుకున్నారు. ఫొటోగ్రాఫర్లతో వారు దురుసుగా ప్రవర్తించి తోసేశారు.
మీడియాతో మాట్లాడకుండానే నిత్యానంద, రంజిత అక్కడ్నుంచి తిరుగుపయనమయ్యారు. కాగా, గతంలో రంజితతో రాసలీలలు సాగించారనే ఆరోపణలు ఎదుర్కొన్న స్వామి వచ్చాడని తెలిసిన భక్తులు వారిని చూసేందుకు ఆసక్తి కనబర్చారు.
కాగా, రంజితతో ఆయన ఆశ్రమంలోని ఓ గదిలో నిత్యానంద స్వామి కలిసి ఉన్నట్లున్న ఓ వీడియోను ఆయన శిశ్యుడే గతంలో విడుదల చేయడం సంచలనం రేపింది. ఆ వీడియోలో నిత్యానంద స్వామి, రంజిత సాన్నిహిత్యంగా ఉండటం గమనార్హం. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. విచారించిన అనంతరం నిత్యానంద బెయిల్‌పై విడుదలయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించగా.. నిత్యానంద పురుషుడేనని, లైంగిక చర్యకు పాల్పడే అవకాశం ఉందని వైద్య నివేదికలు తేల్చాయి.












Click it and Unblock the Notifications