చంద్రబాబుకు ఇబ్బందులు, అప్పుడే చెప్పా: స్వరూపానంద

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ముహూర్త బలం లేదని చెప్పానని, అందుకే ఆయన ఇబ్బందులు పడుతున్నారని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి గురువారం అన్నారు.

తిరుమల శ్రీవారిని ఆయన ఉదయం దర్సించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. శ్రీవారి ఆలయం పైన విమానాలు తిరగడం దేశానికి అరిష్టమని చెప్పారు. ఇలాంటి వాటి పైన స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

తిరుమల పవిత్రతను కాపాడటంలో దేవాదాయ శాఖ, టీటీడీలు విఫలమయ్యాయని చెప్పారు. నామాల గొడవ దురదృష్టకరమని చెప్పారు. వీఐపీల దగ్గరకు వెళ్లి సేవలు చేసే అర్చకులు శ్రీవారి కైంకర్యాల్లో లోపాలు చేయడం విచారకరమన్నారు.

కాగా, నవ్యాంధ్ర రాజధానికి భూమిపూజలో వాస్తుదోశాలు ఏమైనా ఉన్నాయా? భూమిపూజలో కానీ బొడ్రాయి స్థానపలో కానీ ఏమైనా లోపాలు జరిగాయా? ముహూర్త బలం అనుకూలంగా లేదా? చంద్రబాబుకు, ఆ పార్టీ నాయకులకు ప్రస్తుతం ఏర్పడిన రాజకీయ ఇబ్బందికర పరిస్థితులకు అవే కారణమా? అనే ప్రశ్నలు టీడీపీ నేతలు, కార్యకర్తల్లో వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే.

భూమిపూజ చేసేందుకు జూన్ 6వ తేదీన ఉదయం 8.49 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. అనుకున్న విధంగా ఆరో తేదీన మందడంలో ఇది జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభం కాకముందే ఓటుకు నోటు వ్యవహారం తెరమీదకు వచ్చింది. అనంతరం టీడీపీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

చంద్రబాబు

చంద్రబాబు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు చిక్కులు ఎందుకు వస్తున్నాయి? సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్త బలం బాగా లేదా? లేక భూమిపూజ ముహూర్త బలం బాగా లేదా అనే చర్చ సాగుతోంది.

స్వామీజీ

స్వామీజీ

విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి గురువారం ఉదయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

స్వామీజీ

స్వామీజీ

విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి గురువారం ఉదయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.

స్వామీజీ

స్వామీజీ

విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి గురువారం ఉదయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ధ్వజానికి మొక్కుతున్న స్వామీజీ.

స్వామీజీ

స్వామీజీ

విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి గురువారం ఉదయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అధికారులతో స్వామి.

భూమిపూజ తర్వాత జరిగినప్పటికీ ముందే ఫిక్స్ చేశారని, అలాగే చంద్రబాబు ప్రమాణ ఘడియలు కూడా బాగా లేవని చెప్పారని గుర్తు చేస్తున్నారు. మరోవైపు, బొడ్రాయి స్థాపన అనంతరం చేయాల్సిన పూజలు, చంద్రబాబుకు ఎదురు దెబ్బలు తొలగించేందుకు చేయాల్సిన పూజల పైన చర్చలు జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. చంద్రబాబు జాతకం బాగానే ఉందని, చిన్న చిన్న అవాంతరాలు తప్పవని భావిస్తున్నారంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+