వెయ్యి కోట్లిస్తే లగడపాటిని చేర్చుకుంటారు: కెసిఆర్‌పై ఫైర్

T Congress blames KCR for Konda Surekha targetting Kodandaram
హైదరాబాద్/వరంగల్: వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తే లగడపాటి రాజగోపాల్‌ను కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తమ పార్టీలో చేర్చుకుంటారని వరంగల్ పార్లమెంటు సభ్యులు రాజయ్య బుధవారం ఎద్దేవా చేశారు. తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం పైన తెరాస నాయకురాలు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై టి కాంగ్రెసు నేతలు ధీటుగా స్పందించారు.

వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తే లగడపాటిని కూడా కెసిఆర్ తన పార్టీలో చేర్చుకుంటారన్నారు. తెరాస నీచ రాజకీయాలకు పాల్పడవద్దన్నారు. కోదండరాం వల్లే తెలంగాణ ఉద్యమం బలపడిందని మాజీ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఇంత ఉద్యమానికి కారణం ఆయనే అన్నారు. అలాంటి కోదండరాంను కొండా సురేఖ విమర్శించడం విడ్డూరమన్నారు.

కోదండరాం పైకి కెసిఆరే కొండా దంపతులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. శాంతియుత వరంగల్‌ను కొండా దంపతులు అల్లకల్లోలం చేసేలా ఉన్నారని ధ్వజమెత్తారు. ఉద్యమకారుల అంతు మీరు చూస్తారా అని కొండా సురేఖను ప్రశ్నించారు.

పొత్తుల పేరుతో తాము సిట్టింగ్ స్థానాలను వదులుకునే ప్రసక్తి లేదని కేంద్రమంత్రి బలరాం నాయక్ చెప్పారు. తనకు వారసత్వ రాజకీయాల గురించి తెలియదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. ఆమె తలచుకోకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+