పోలవరంపై బీజేపీ: ఏం చేయలేక టీ కాంగ్రెస్, బాధతోనే..

యుపిఎ ప్రభుత్వ హయాంలో ఈ ఆర్డినెన్స్ వచ్చి ఉండకపోతే ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శల దాడి చేయడమే కాకుండా ఆందోళనలతో అట్టుడుకించే వాళ్ళమని తెలంగాణ కాంగ్రెస్ వారు చెబుతున్నారట. అయినప్పటికీ శనివారం తెలంగాణ ఐకాస ఇచ్చిన బంద్‌లో పాల్గొన్నారు.
ఏడు మండలాలు, రెండు వందలకు పైగా గ్రామాలు ముంపునకు గురవుతాయి. అయితే ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని నిరసనలు, ఆందోళనలు చేపట్టడానికి అవకాశం లేకుండా పోయిందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
ఎపి పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2014లోనే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, పోలవరం ముంపు గ్రామాల ఆర్డినెన్స్‌ను బిల్లు రూపంలో తీసుకుని వచ్చి కేంద్రం ఆమోదించినందున ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ఆందోళన చేయడానికి అవకాశం లేకుండా పోయిందని కాంగ్రెస్ నేతలు కొందరు బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ మాట్లాడుతూ.. తాము అప్పుడు బాధతోనే ముంపు మండలాలను బిల్లులో పెట్టామని వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు కాంగ్రెసు బీజేపీని ప్రశ్నించలేని పరిస్థితి వచ్చింది.
పోలవరం అంశానికి సంబంధించి తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా బీజేపీ, టీడీపీలను లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ కాంగ్రెసు నేతల మాదిరిగా తెలంగాణ టీడీపీ నేతలు మౌనం దాల్చుతున్నప్పటికీ బీజేపీ నేతలు మాత్రం ధీటుగానే స్పందిస్తున్నారు. యూపీఏ హయాంలోనే ఇది వచ్చిందని అప్పుడు కేసీఆర్, కాంగ్రెసు, తెరాస ఏం చేస్తోందని ఎదురు దాడి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications