'పవన్ కళ్యాణ్ ముద్రగడకు మద్దతుగా నిలుస్తారా?'
హైదరాబాద్: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్షకు జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలుస్తారా లేదా చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ నేత వి హనుమంత రావు గురువారం నాడు ప్రశ్నించారు. కాపు నేతకు మద్దతు పైన పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పాలన్నారు.
తుని హింసాకాండకు అమాయకులను బాధ్యులుగా చూపిస్తూ అరెస్టు చేయడం బాధాకరమని చెప్పారు. ముద్రగడకు పవన్ మద్దతుగా నిలవాలన్నారు. పవన్ స్పష్టమైన వైఖరి ప్రకటింాలని డిమాండ్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపు రిజర్వేషన్ల అంశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.

చంద్రబాబు నాయుడు ఇదే వైఖరి అవలంభిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వంతో కాపు రిజర్వేన్ల అంశం పైన పవన్ కళ్యాణ్ చర్చించాలని వి హనుమంత రావు డిమాండ్ చేశారు. తునిలో కాపు గర్జన సమయంలో కూడా విహెచ్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications