ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌పై కోడిగుడ్లతో, వెంకయ్య ఇంటిపైనా..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌పై తెలంగాణ న్యాయవాదులు మంగళవారం హైదరాబాదులో దాడి చేశారు. కొడిగుడ్లు, టొమాటోలతో వారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తూ వారు ఈ దాడికి పాల్పడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇప్పటికైనా అడ్డు పడవద్దని వారు చంద్రబాబును డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా తెలంగాణవాదులు నినాదాలు చేశారు. తెలంగాణవాదులకు పోటీగా జై చంద్రబాబు అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

కాగా, బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడి ఇంటిని ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి కార్యకర్తలు మంగళవారం ఢిల్లీలో ముట్టడించారు. ఢిల్లీలో ఉన్న ఓయు జెఎసి నేతలు పిడమర్తి రవి, కైలాస్ తదితరులు వెంకయ్య నాయుడి నివాసానికి వెళ్లి ఆందోళనకు చేశారు.
తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెబుతూనే సీమాంధ్ర ప్రయోజనాల ముసుగులో తెలంగాణకు వెంకయ్య నాయుడు అడ్డుపడుతున్నారని వారు విమర్శించారు. తెలంగాణకు అడ్డుపడడం వెంకయ్య నాయుడు మానుకోవాలని వారు డిమాండ్ చేశారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications