చంద్రబాబుపై ఉండవల్లి శ్రీదేవి సంచలన ట్వీట్
వైసీపీని వీడి టీడీపీలో చేరిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేల్లో ఇద్దరికి ఎదురు దెబ్బ తగిలింది. జగన్‌ను కాదని టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు గట్టి షాకిచ్చారు. జగన్‌తో విభేదించి..ఆనం నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఈ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచారు. ఈక్రమంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ దక్కుతుందని ఆశించిన నేతలకు చంద్రబాబు మొండిచేయి చూపించారు
వైసీపీని వీడి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేల్లో కేవలం ఇద్దరికి మాత్రమే టికెట్ కేటాయించారు. ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు మాత్రమే టీడీపీలో తిరిగి టికెట్లు దక్కించుకోగలిగారు. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలకు తీవ్ర నిరాశ ఎదురైంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిల నియోజకవర్గాల్లో వేరే వ్యక్తులకు టిక్కెట్లు కేటాయించారు. తనకు టికెట్ దక్కకపోవడంపై ఉండవల్లి శ్రీదేవి తాజాగా స్పందించారు.

జగన్‌తో విభేదించి టీడీపీకి మద్దతు తెలిపిన తనకు టికెట్ కేటాయించకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి తాడికొండ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తాడికొండకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండవల్లి శ్రీదేవికి టీడీపీ టికెట్ కేటాయించలేదు. ఆమె స్థానంలో శ్రవణ్ కుమార్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ఉండవల్లి శ్రీదేవికి తిరువూరు టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ అది కూడా దక్కలేదు.
రాజకీయాలు ఎలా ఉంటాయో..
— MLA Dr Vundavalli Sridevi (@MlaSrideviDr) March 22, 2024
ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థం అయ్యింది!! #Bapatla 🗡️ pic.twitter.com/6Mhl0KY7t4
దీంతో తీవ్ర నిరాశలో కురుకుపోయిన ఉండవల్లి శ్రీదేవి చంద్రబాబు నిండా ముంచారనే అర్థం వచ్చేలా తన అధికారిక ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ''రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థం అయింది'' అంటూ కత్తి సింబల్‌తో ట్వీట్ చేశారు. టికెట్ దక్కకపోవడంతో ఉండవల్లి శ్రీదేవి తన అసంతృప్తిని ఈ విధంగా బయటపెట్టారని తెలుస్తోంది. తీవ్ర నిరాశలో కురుకుపోయిన ఉండవల్లి శ్రీదేవి చంద్రబాబు నిండా ముంచారని... జగన్‌ను కాదని బయటకు వచ్చి తప్పు చేశామంటూ తన అనుచరుల వద్ద శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆమె మళ్లీ వైసీపీలోకి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications