వైఎస్ జగన్ ను నమ్ముకొని అన్నీ కోల్పోయాం - వైసీపీ ఎమ్మెల్యే సంచలనం..!!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. వైఎస్ కుటుంబానికి తొలి నుంచి విధేయుడైన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. సుదీర్ఘ కాలంగా తాడిపత్రిలో పెద్దారెడ్డి జేసీ బ్రదర్స్ పైన పోరాటం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు..అధికారులు సహకరించకపోవటం పైన పెద్దారెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి.
పెద్దారెడ్డి కీలక వ్యాఖ్యలు : అనంతపురం జిల్లాలో వైసీపీ 2019 ఎన్నికల్లో 12 స్థానాలు గెలిచింది. ఉరవకొండ, హిందూపురం మాత్రమే టీడీపీ విజయం సాధించింది. తాడిపత్రిలో వైసీపీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం సాధించారు. ఎమ్మెల్యే గా గెలిచిన సమయం నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సస్ పెద్దారెడ్డి అన్నట్లుగా అక్కడ రాజకీయం కొనసాగుతోంది.

అనేక సార్లు అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర స్థాయిలో చర్చకు దారి తీసాయి. పలు సందర్భాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తిరిగి వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి పెద్దారెడ్డి పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. కానీ, ఈ సమయంలోనే పెద్దారెడ్డి కార్యకర్తల విషయంలో చేసిన వ్యాఖ్యలు జిల్లాలో చర్చకు దారి తీసాయి.
పార్టీ నేతల తీరుపై అసహనం : అనంతపురం జిల్లా యల్లనూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి అక్కడ బైఠాయించారు. దంతలపల్లిలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీని పైన మ్మెల్యే పెద్దారెడ్డి, నారాయణ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం నెలకొంది. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
దీంతో ఇరు వర్గాలపై యల్లనూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారంటూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ఇదే సమయంలో పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలను గుర్తిస్తేనే నేతలుగా గుర్తింపు దక్కుతుందని చెప్పుకొచ్చారు.

సర్వం కోల్పోయమంటూ : తాను జగన్ కోసం సర్వం పొగొట్టుకున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో ఉన్న సమయం నుంచి ఇప్పటి వరకు వైఎస్ కోసం పని చేసారని గుర్తు చేసారు. ఎవరు మన కోసం పని చేసారు, వారికి ఏం చేయాలనే ఆలోచన నేతలకు ఉండాలని చెప్పుకొచ్చారు.
ఆ ఆలోచన లేకపోతే ఉనికి కోల్పోతారని హెచ్చరించారు. కార్యకర్తలు మద్దతుగా ఉన్నంత వరకే ఎవరైనా నేతలుగా చెలామణి అవుతారని పేర్కొన్నారు. తొలి నుంచి జగన్ కు విధేయుడిగా పేరున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇప్పుడు చేసిన వ్యాఖ్యల పైన వైసీపీలో చర్చ మొదలైంది. దీని పైన పార్టీ ముఖ్య నేతలు ఏం జరిగిందనే అంశం పైన ఆరా తీస్తున్నట్లు సమాచారం.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications