• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్సీగా సీఎం జగన్ సలహాదారు - కొత్తగా 14 మంది ఖరారు : అవకాశం దక్కేది వీరికే..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీ శాసనమండలిలో అధికార వైసీపీ పూర్తి మెజార్టీ సాధించబోతోంది. అసలు శాసన మండలి వద్దు..రద్దు చేద్దామంటూ అసెంబ్లీలో తీర్మానం చేసిన వైసీపీ..ఇప్పుడు పూర్తి మెజార్టీతో అటు శాసనసభలో.. ఇటు శాసన మండలిలోనూ పూర్తి ఆధిపత్యం సాధిస్తోంది. తాజాగా ఎన్నికల సంఘం ఎమ్మెల్యే కోటాలో మూడు స్థానాలు..స్థానిక సంస్థల కోటాలో 8 జిల్లాల నుంచి 11 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, ముందు నుంచి ఈ ఎన్నికల పైన అంచనాతో ఉన్న వైసీపీ..ఇప్పుడు అభ్యర్ధుల ఎంపికపై తుది కసరత్తు చేస్తోంది. ఈ సారి ముఖ్యమంత్రి జగన్ సలహాదారుడు సైతం ఎమ్మెల్సీ కాబోతున్నారు.

Recommended Video

AP MLC Elections : అభ్యర్ధుల ఎంపిక పూర్తి .. కొత్తగా 14 మంది ఖరారు..! || Oneindia Telugu
శాసన మండలిలో వైసీపీకి పూర్తి మెజార్టీ దిశగా

శాసన మండలిలో వైసీపీకి పూర్తి మెజార్టీ దిశగా

అసెంబ్లీతో పాటుగా మొత్తం 13 జిల్లాల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించటంతో ఇప్పుడు 14 స్థానాలు వైసీపీకే దక్కటం లాంఛనంగా కనిపిస్తోంది. ఇక, ఎమ్మెల్యే కోటాలో మూడు స్థానాల్లో కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి పేరు ఖరారు చేసారు. అదే విధంగా బీసీ కోటాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పాలవలస విక్రాంత్ పేరు ఖాయంగా తెలుస్తోంది. మూడో పేరు రాయలసీమకు చెందిన ఎస్సీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక, స్థానిక సంస్థల కోటాలో ఎంపిక పైనా సీఎం ఫోకస్ చేసారు. అందులో భాగంగా... విజయనగరం జిల్లా నుంచి ఇందుకూరు రఘురాజు పేరు సీఎం ఇప్పటికే ఆమోదించినట్లుగా సమాచారం.

అభ్యర్ధుల ఎంపిక పై తుది కసరత్తు

అభ్యర్ధుల ఎంపిక పై తుది కసరత్తు

విశాఖ జిల్లాలో రెండు స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. అందులో ఒకటి బీసీ వర్గానికి చెందిన వంశీక్రిష్ణ యాదవ్ కు దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. వరుదు కళ్యాణి పేరు సైతం రెండో స్థానం కోసం ప్రచారంలో ఉంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి అనంతబాబు కు ఎమ్మెల్సీ సీటు ఖాయమైనట్లు సమాచారం. ఇదే జిల్లా నుంచి గత ఎన్నికల్లో పెద్దాపురం నుంచి పోటీ చేసి ఓడిన..తోట నరసింహం సతీమణి తోట వాణి పేరు ఖరారు అవుతుందని చెబుతున్నారు. అదే విధంగా అనంత ఉదయ భాస్కర్ తో పాటుగా ఆకుల వీర్రాజు పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

ఎమ్మెల్సీగా సీఎం సలహాదారు రఘురాం

ఎమ్మెల్సీగా సీఎం సలహాదారు రఘురాం

ఇక, కృష్ణా జిల్లా నుంచి రెండు స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. అందులో ఒకటి కమ్మ వర్గానికి..రెండో స్థానం బీసీ వర్గానికి ఇవ్వనున్నారు. కమ్మ వర్గం నుంచి ముఖ్యమంత్రి జగన్ సలహాదారు గా ఉన్న తలశిల రఘురాం కు ఎమ్మెల్సీ స్థానం ఖాయమైనట్లు తెలుస్తోంది. ఆయన జగన్ పార్టీ ఏర్పాటు సమయం నుంచి ఆయనతో ఉన్నారు. జగన్ పాదయాత్ర సమయంలో మొత్తం రఘురాం రూట్ మ్యాప్ నుంచి సభలు...కార్యక్రమాల బాధ్యత తీసుకున్నారు. కమ్మ వర్గం నుంచి గన్నవరం కు చెందిన యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రారావులలో ఒకరికి ఇస్తారని భావించినా... ఇప్పుడు రఘురాం కు ఖయామైనట్లు తెలుస్తోంది. రెండో స్థానం బీసీ వర్గానికి కేటాయించనున్నారు.

వీరి పేర్లు ఖరారయ్యాయంటూ..

వీరి పేర్లు ఖరారయ్యాయంటూ..

గుంటూరు జిల్లా నుంచి రెండు స్థానాలు ఉండగా... అందులో కమ్మ వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్.. కాపు వర్గానికి చెందిన ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లుకు దక్కనున్నాయి. ప్రకాశం నుంచి రెడ్డి లేదా ఎస్సీ వర్గానికి కేటాయించే ఛాన్స్ ఉంది. ఇక, అనంతపురం నుంచి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డికి ఖాయమని సమాచారం. కర్నూలు జిల్లా నుంచి నంద్యాలకు చెందిన ఇషాక్ పేరు పరిశీలనలో ఉంది. ఇక, చంద్రబాబు సొంత జిల్లా ..సొంత నియోజకవర్గం అయిన కుప్పం నుంచి భరత్ కు ఎమ్మెల్సీ పదవి ఖాయమైనట్లుగా తెలుస్తోంది.

సామాజిక - ప్రాంతీయ సమీకరణాలే కీలకం

సామాజిక - ప్రాంతీయ సమీకరణాలే కీలకం

గతంలో రెండు సార్లు చంద్రబాబు పైన పోటీ చేసి ఓడిపోయిన చంద్రమౌళి కుమారుడైన భరత్, తన తండ్రి మరణంతో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా కొనసాగుతున్నారు. ఇప్పుడు వైసీపీ కుప్పం పైన స్పెషల్ ఫోకస్ పెట్టటంతో భరత్ కు ఖాయం కానుంది. మొత్తం 14 స్థానాల్లో 50 శాతం సీట్లు అంటే 7 స్థానాలు ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనార్టీలకు అవకాశం ఇవ్వనున్నారు. అదే విధంగా ప్రాంతీయ - సామాజిక సమీకరణాలు పక్కగా అమలు చేస్తూ సీఎం జగన్ తుది జాబితా ఈ సాయంత్రం ఖరారు చేసే అవకాశం ఉంది. చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగితే మినహా.. ఇవే పేర్లు ఖరారయ్యే ఛాన్స్ ఉంది.

English summary
CM Jagan's advisor YSRCP Coordinator Talasila Raghuram will be sent to the council if news is to be believed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X