చర్చలు విఫలం: అంగన్వాడీల సమ్మె సైరన్; నేడు ఎమ్మెల్యేల ఇళ్ళ ముట్టడి!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో అంగన్వాడీల చర్చలు విఫలమయ్యాయి. జీతాల పెంపు సాధ్యం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. మాది మహిళా పక్షపాత ప్రభుత్వమని, వేతనాల పెంపునకు కొంత సమయం కావాలని అడిగామని సంక్రాంతి తర్వాత దీనిపై మరోసారి చర్చిస్తామని మంత్రి బొత్సా సత్యన్నారాయణ పేర్కొన్నారు.
పలు డిమాండ్లను ఇప్పటికే నెరవేర్చామని, గర్భిణిలు, బాలింతల ఇబ్బందుల దృష్ట్యా సమ్మె విరమించాలని అంగన్వాడిల బృందానికి విద్య శాఖ మంత్రి బొత్స సత్యనారయణ విజ్ఞప్తి చేశారు. అయితే జీతాలు పెంచకుంటే సమ్మెను విరమించేది లేదని అంగన్వాడి సంఘాలు స్పష్టం చేశాయి. సమ్మెను వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి.

అంగన్వాడీలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అంగన్వాడీ సఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు మా సమస్యను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లలేదని మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారని, ఇప్పటివరకు తమ సమస్యలను సీఎం దృష్టికి ఎందుకు తీసుకు వెళ్ళ లేదో చెప్పాలని వారు ప్రశ్నించారు. సీఎం దగ్గర వీళ్ళంతా మంత్రులుగా ఉన్నారా లేదా అంటూ అనుమానం వస్తుందని వారు పేర్కొన్నారు.
సంక్రాంతి వరకు సమ్మెను వాయిదా వేస్తే అప్పుడు సమస్యను పరిష్కరిస్తామని మంత్రి చెబుతున్నారని, 15 రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఏమైనా బంగారు గనులు వచ్చేస్తాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. అంగన్వాడీల ఉద్యమం నీరు గార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మండిపడుతున్నారు. రాష్ట్రంలో అంగన్వాడీల జీతాలు పెంచడానికే డబ్బులు లేవా అంటూ అంగన్వాడి సంఘాలు మండిపడ్డాయి.
అంగన్వాడీలు మానసిక ఆవేదనకు గురవుతున్నారని, కొందరు అంగన్వాడీలు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఐసీయూలో ఉన్నారని వారు చెప్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు, అంగన్వాడీల విషయంలో సానుకూలంగా స్పందించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తమ డిమాండ్ల సాధనకు నేడు ఎమ్మెల్యేల ఇళ్ళు ముట్టడిస్తామని, వచ్చే నెల మూడవ తేదీన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేపడతామని అంగన్వాడీలు స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ప్రచ్చన్న సమరమే అంటూ అంగన్వాడీలు తేల్చి చెబుతున్నారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications