సీమాంధ్ర ఉద్యోగులతో సబ్ కమిటీ చర్చలు విఫలం

విభజన జరిగితే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఉద్యోగులు తెలిపారు. కేంద్రం నుంచి తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఉద్యోగులు మంత్రి వర్గ ఉపసంఘానికి తేల్చి చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల సంభవించే నష్టాల చాలా ఎక్కువ అని, అందువల్ల సమ్మె వల్ల కలిగే నష్టాలను భరించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని ఉద్యోగులు చెప్పారు.
సమావేశానికి ఎపిఎన్జీవోలు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు హాజరు కాలేదు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పితాని సత్యనారాయణ, కొండ్రు మురళి చర్చల్లో పాల్గొన్నారు.
ఇదిలావుంటే, సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెపై విచారణను హైకోర్టు శనివారానికి వాయిదా వేసింది. ఎపి ఎన్జీవోల సమ్మె చట్టవిరుద్ధమంటూ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై శుక్రవారం కూడా హైకోర్టు విచారణ జరిపింది.












Click it and Unblock the Notifications