వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ బాటలో స్టాలిన్- ఏపీ తరహాలో ఆ రాష్ట్రంలోనూ : అసెంబ్లీ వేదికగా..!!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని ఇప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్ అమలుకు నిర్ణయించారు. అందులో భాగంగా తమిళనాడు అసెంబ్లీ వేదికగా సీఎం స్టాలిన్ కీలక ప్రకటన చేసారు. ఏపీలో జగన్ అధికారం లోకి వస్తూనే సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. దీని పైన పలు రాష్ట్రాల అధికారులు ఏ విధంగా అమలు అవుతన్నదీ ఏపీకి వచ్చి మరీ అధ్యయనం చేసారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ -వార్డు సచివాలయాలను అందుబాటులోకి తెచ్చింది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా అన్ని రకాల ప్రభుత్వ సేవలు ప్రజల ముంగిటకే తీసుకొచ్చే ప్రయత్నం చేసింది.

జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే

జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే

ప్రభుత్వ పథకాలతో పాటుగా అన్ని రకాల సేవలు వాలంటీర్ల ద్వారా అమలు చేస్తోంది. ఇప్పుడు ఇదే విధంగా సచివాలయ వ్యవస్థను తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయించారు. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలనకు దోహదపడే గ్రామ సచివాలయాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 600 గ్రామ సచివాలయాలను నిర్మిస్తామని తెలిపారు.

గ్రామంలోనే అన్ని రకాల సేవలు అందిస్తూ

గ్రామంలోనే అన్ని రకాల సేవలు అందిస్తూ

పరిపాలనా సౌలభ్యం కోసం ఈ గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో డీఏంకే ప్రభుత్వం పంచాయతీలు, పట్టణ పంచాయతీలకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని స్టాలిన్ గుర్తు చేసారు. ఏపీలో ఇప్పుడు సచివాలయ సిబ్బంది ప్రొబేషన్ ..వారికి శాశ్వత ప్రాతిపదిక ఉద్యోగాల పైన జూన్ నెలాఖరు నాటికి అమలయ్యేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది. ఇక ,వాలంటీర్లకు మాత్రం గౌరవం వేతనం అందిస్తోంది.

సచివాయాల్లో విస్తరిస్తున్న సేవలు

సచివాయాల్లో విస్తరిస్తున్న సేవలు

వారికి ప్రభుత్వం నుంచి ఈ మధ్య కాలంలోనే పురస్కారాలతో సత్కరించారు. ఇక, ఇప్పుడు ఈ వ్యవస్థలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్దమైంది. గ్రామ సచివాలయాలతో పాటుగా ఆర్కేబీ సెంటర్లు ఏర్పాటు చేసారు. వార్డు - గ్రామ సచివాలయాల్లోనే అన్ని రకాల సేవలతో పాటుగా తాజాగా రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించారు. ఇక, ఇప్పుడు తమిళనాడు లోనూ గ్రామ సచివాలయల ఏర్పాటు నిర్ణక్ష్ం ఏపీ అధికార పార్టీలో కీలక చర్చకు కారణమైంది.

English summary
Tamil Nadu Chief Minister M K Stalin announced setting up village secretariats across the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X