పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు - ఏం జరుగుతోంది..!!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ సనాతన ధర్మం కోసం పర్యటనలు చేస్తున్నారు. తమిళనాడులో ఎక్కువగా కార్యక్రమాలకు హాజరు అవుతున్నారు. అక్కడ బీజేపీ నేతలతో కలిసి సభల్లో పాల్గొంటున్నారు. డీఎంకే నేతలు సైతం పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. సవాళ్లు విసురుతున్నారు. ఈ సమయంలోనే మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పవన్ పైన క్రిమినల్ కేసు నమోదైంది. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారుతోంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ పైన తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. మధురైలో ఇటీవల జరిగిన ఓ ఆధ్యాత్మిక సభలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించటంతో పాటుగా..రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఈ కేసును నమోదు చేశారు. పవన్‌తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై, హిందూ మున్నాని నాయకులపై కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గత నెలలో మదురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పాల్గొన్న సమయం లో నిబంధనలు ఉల్లంఘించారని పవన్ పైన ఆరోపణలు వచ్చాయి. అన్నానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అడ్వకేట్ వాంజినాతన్ ఫిర్యాదు మేరకు పోలీసులు పవన్ తో పాటుగా ఈ సభ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

కాగా, ఈ కేసులో పోలీసులు IPC సెక్షన్ 196(1)(a), 299, 302, 353(1)(b)(2) ల కింద ముమ్మడిగా కేసు నమోదు చేశారు. సభలో ప్రసంగించిన పవన్ సున్నిత అంశాలను ప్రస్తావిస్తూ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసారనే ఆరోపణల తో కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ముదులో మురుగన్ భక్తుల సదస్సు జరగడానికి ముందే ఆంక్షలు విధించినా, వాటిని పాటించకుండా కార్యక్రమాన్ని నిర్వహించారన్నది ప్రధానంగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆధ్యాత్మిక సభ పేరుతో అనుమతి పొంది, రాజకీయ, మతపరమైన ప్రసంగాలు చేయరాదన్న హైకోర్టు షరతును నిర్వాహకులు ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హిందువులు ఏకతాటిపై నిలిచి ఓటు వేయాలని, డీఎంకే ప్రభుత్వం ఆలయాలను ఆదాయ వనరుగా చూడటం మానుకోవాలని సభలో తీర్మానాలు చేయడం వివాదాస్పదంగా మారింది. అయితే.. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగను న్నాయి. డిప్యూటీ సీఎం పవన్ తమిళనాడులో ఎన్డీఏ అజెండా అమలు కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు పవన్ పైన తమిళనాడులో కేసు నమోదు వ్యవహారం రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఈ కేసు పైన జనసేన నేతలు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications