Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తమిళనాట తెలుగు ఓటర్లు ఎవరి వైపు, విజయ్ Vs పవన్ - సీన్ ఛేంజ్: గ్రౌండ్ రిపోర్ట్..!!

తమిళనాడు ఎన్నికలు హోరా హోరీగా మారాయి. రెండు కూటములు..విజయ్ పార్టీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇప్పటికే పొత్తులు.. సీట్ల లెక్కలు ఖరారయ్యాయి. అభ్యర్ధుల ఎంపిక పైన తుది కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో తమిళనాట ఉన్న తెలుగు ప్రజల మద్దతు మూడు పార్టీలకు కీలకంగా మారుతోంది. దాదాపు 40 శాతం ఓటర్లు ఉండటంతో.. డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారుతున్నారు. అయితే, వీరి మద్దతు కోసం తెలుగు రాష్ట్రాల నేతలను ప్రధాన పార్టీలు ప్రచారం లోకి దించుతున్నాయి. కాగా.. గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం మరింత ఆసక్తిని పెంచుతోంది.

తమిళనాడులో ఇప్పుడు ఎన్నికలు డీఎంకే - ఎన్డీఏ, విజయ్ పార్టీ భవిష్యత్ కు కీలకంగా మారాయి. పార్టీల అధినేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఏ అవకాశాన్ని వదులుకునేందుకు సిద్దంగా లేరు. ఇదే సమయంలో తమిళనాడులో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు ఓటర్లను తమ వైపు తిప్పు కొనేందుకు ప్రధాన పార్టీలు రంగంలోకి దిగాయి. తమిళనాడులో దాదాపు 40 శాతం ఓటర్లు తెలుగు వారే కావటం ఇందుకు ప్రధాన కారణం. దాదాపు 45 లక్షల మంది తెలుగు మాట్లాడే వారు తమిళ నాడులో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. తిరువళ్లూరు, కోయంబత్తూరు, హోసూరు, పళని, తిరుత్తణి, రాజపాళ్యం వంటి ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు గెలుపు ఓటములను డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నారు. చెన్నై, కాంచీపురం జిల్లాల్లో అయితే అధిక శాతంలో తెలుగు ఓటర్లే ఉన్నారు. శ్రీపెరంబుదూరు, కాంచీపురం, చెన్నై శివార్లలోని హార్బర్‌, ఆవడి, కొళత్తూరు, వేళచ్చేరి, అన్నా నగర్‌, విరుగుంబాక్కం, ఆర్‌.కె.నగర్‌ తదితర ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు కీలకంగా వ్యవహరి స్తున్నారు. కోవిల్‌పట్టి, విళాత్తికుళం, విరుదునగర్‌, సాత్తూర్‌, రాజపాళెయం, శ్రీవిళ్లిపుత్తూరు, పెరియకుళం, తళి, సేలం, ఆండిపట్టి, సింగానల్లూరు, తేని, బర్గూరు, గుడియాత్తం, ఇతర ప్రాంతాల్లోనూ తెలుగువారి ప్రభావం ఎక్కువే.

లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!!
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!!
dmk-vs-nda-vs-vijay-who-will-win-the-hearts-of-tamil-nadu-s-massive-telugu-bloc

కాగా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు అత్యధిక సంఖ్యలో చెన్నై చుట్టుపక్కల స్థిరపడ్డారు. నాయుడు(కాపు), కమ్మనాయుడు, రెడ్డి, కొండరెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణులు, ఆదిఆంధ్ర, అరుంధతియర్ల్లు, బేరివైశ్య, 24-మనై తెలుగు చెట్టియార్‌లు, గొల్ల, యాదవ, క్షత్రియ, పద్మశాలి తదితర సామాజిక వర్గాలకు చెందిన వారు తమిళనాడులో ఉన్నారు. మదురై ప్రాంతంలోని నాయకర్లు (నాయుడు సామాజికవర్గం) ఒక బలమైన శక్తిగా ఉంది. దీనికి తగ్గట్లు అన్నాడీఎంకే, డీఎంకే తెలుగు మాతృభాషగా కలిగిన వారికి సీట్లు కేటాయించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న త్రిము పోటీలో తెలుగువారి ఓట్లను పొందేందుకు తమిళ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాగా.. ఏపీలో ఎన్డీఏ- వైసీపీ బలంగా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బలమైన పార్టీలు. వీటి ప్రభావం.. మద్దతు తమిళనాడులో తెలుగు ఓటర్ల పైన ఉండనుంది. కాగా, తమిళనాడులో తెలుగు ఓటర్లను ఆకట్టు కొనేందుకు బీజేపీ మిత్రపక్షాలైన చంద్రబాబు, పవన్ ను ప్రచారంలోకి దించాలని భావిస్తున్నారు.

పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!?
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!?

తమిళనాడులో మారుతున్న లెక్కలు

తమిళనాడు లో ఇప్పుడు విజయ్ ఎన్నికల వేళ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు. విజయ్ ప్రభావం ఎంత తగ్గిస్తే తమకు అంత కలిసి వస్తుందని బీజేపీ నేతలు కలిసి వస్తున్నారు. బీజేపీ 27 సీట్లలో పోటీకి అంగీకరించింది. అటు డీఎంకే తెలుగు ప్రజల మద్దతు తమకే అనే ధీమాతో ఉంది. 2021 ఎన్నికల ఫలితాల సరళి గమినిస్తే తెలుగు ప్రజలు డీఎంకే - అన్నా డీఎంకే వైపే మొగ్గు చూపారు. ఇప్పుడు విజయ్ కు తెలుగు వారిలో మంచి ఫాలోయింగ్ ఉంది. అదే విధంగా ఇటు పవన్ ఎన్డీఏ నుంచి విజయ్ కు వ్యతిరేకంగా ప్రచారానికి వస్తారని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడులోనూ పవన్ కు ఫ్యాన్ బేస్ కు ఢోకా లేదు. దీంతో.. ఇప్పుడు తమిళనాడులో స్థిర పడిన తెలుగు వారు విజయ్ కు ఏ మేర మద్దతు ఇస్తారనేది కీలకంగా మారుతోంది. ఏపీలో పవన్ కు అండగా నిలవటంతో.. కొత్తదనం కోరుకుంటున్న తెలుగు వారు తమిళనాడులో విజయ్ కు మద్దతు ఇస్తారా అనేది మరింత స్పష్టత రావాల్సి ఉంది. దీంతో.. మెజార్టీ నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిన తెలుగు ఓటర్లు తమిళనాడు ఎన్నికల్లో ఎవరి వైపు అనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+