చంద్రబాబు నాయుడు VS పళనిసామి: చర్చలు విఫలం, భారీ బందోబస్తు, మాతోపెట్టుకోకు !

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరుపతి: ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దులోని కుశస్థలీ నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చెక్ డ్యాం నిర్మాణంతో ఏర్పడిన చిచ్చు రానురాను పెద్దది అవుతోంది. ఈ సమస్యను పరిష్కరించడంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వ అధికారులు విఫలం అయ్యారు.

చంద్రబాబు తలుచుకుంటే: పళనిసామి సీరియస్, ప్రభుత్వం కూలిపోతోంది!పాల దెబ్బ!

అధికారులు చర్చలు విఫలం కావడంతో తమిళనాడు రైతులు ఆందోనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న చెక్ డ్యాం దగ్గరకు చేరుకుని ఆందోళనకు దిగి మాతో పెట్టుకోవద్దు అంటూ నినాదాలు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దెబ్బతో తమిళనాడు ప్రభుత్వం వెలిగరం కెనాల్ లెవల్ పేపట్టాలని నిర్ణయించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. నది జలాల పంపిణి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమాలు ఉల్లంఘిస్తోందని తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి స్వరం పెంచారు.

ప్రజల దాహర్తి తీరుస్తూ !

ప్రజల దాహర్తి తీరుస్తూ !

ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దులోని కుశస్థలీ నది ప్రజల దాహార్తి తీరుస్తూ రైతులకు ప్రధాన వనరుగా ఉంది. వర్షాకాలంలో చిత్తూరు జిల్లాలోని శ్రీరంగరాజపురం మండలం సమీపంలోని క్షీరసముద్రం నుంచి నదిలోని నీరు కుశ ఏరు ద్వారా నాలుగు కిలో మీటర్లు ప్రవహించి తమిళనాడులోని వెలిగరం పెద్ద చెరువుకు చేరుతోంది.

తమిళనాడులో 2 వేల ఎకరాల సాగు !

తమిళనాడులో 2 వేల ఎకరాల సాగు !

ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని క్షీర సముంద్రం నుంచి ప్రవహించే నీరు వెలిగరం చెరువుకు చేరడంతో ఆ పరిసర ప్రాంతాల్లోని 12 గ్రామాల ప్రజలు దాదాపు 2 వేల 500 ఎకరాల పంటసాగు చేస్తుంటారు. ఇదే సందర్బంలో కుశ ఏరుపై చెక్ డ్యాంలు నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి విడుతగా రూ. 28 లక్షల నిధులు విడుదల చెయ్యడంతో ఆందోళనలు మొదలైనాయి.

నాలుగు చెక్ డ్యాంలు !

నాలుగు చెక్ డ్యాంలు !

కుశ ఏరుపై నాలుగు చెక్ డ్యాంలు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసి వెంటనే అధికారులు నిధులు మంజూరు చేశారు. నాలుగు చెక్ డ్యాంల పనులు చకచకా మొదలు పెట్టారు.

ఆంధ్ర, తమిళనాడు రైతుల మద్య చిచ్చు !

ఆంధ్ర, తమిళనాడు రైతుల మద్య చిచ్చు !

తమిళనాడు సరిహద్దులోని వెలిగరం, ఐటీ పట్టెడ, ఇరుదళవాడి పట్టెడ, కీళ్ కాల్ పట్టెడ తదితర 12 గ్రామాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ లోని కుశ ఏరు దగ్గరకు చేరుకుని చెక్ డ్యాం పనులు అడ్దుకోవడంతో ఇరు రాష్ట్రాల రైతుల మధ్య చిచ్చు ఏర్పడింది.

గట్టి పోలీసు బందోబస్తు !

గట్టి పోలీసు బందోబస్తు !

తమిళనాడు రైతులు ఆంధ్రపద్రేశ్ లోకి వచ్చి ఆందోళనకు దిగారని తెలుసుకున్న స్థానిక పోలీసులు చెక్ డ్యాంలు నిర్మిస్తున్న ప్రాంతాలకు వెళ్లి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా తమిళనాడు రైతులు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఆంధ్రా, తమిళనాడు చర్చలు విఫలం !

ఆంధ్రా, తమిళనాడు చర్చలు విఫలం !

ఆంధ్రప్రదేశ్ లోని పుత్తూరు ప్రజా పనుల శాఖ డివిజన్ ఇంజనీరు వెంకటశివారెడ్డి, తమిళనాడు కుశస్థలీ నది తీరప్రాంత చీఫ్ ఇంజనీరు విజయకుమార్, ఇరు రాష్రాల సరిహద్దు తహసిల్ధారులు, పోలీసు అధికారుల బృందాలు చర్చలు చేపట్టారు. అయితే ఇరు రాష్ట్రాల రైతుల వాదనలతో చర్చలు విఫలం అయ్యాయి.

 తమిళ అధికారుల విజ్ఞప్తి !

తమిళ అధికారుల విజ్ఞప్తి !

చెక్ డ్యాం నిర్మిస్తున్న కాలువ లెవల్ చేపట్టి తద్వారా తమిళ రైతులకు జరిగే నష్టాన్ని అంచనా వెయ్యడానికి కొంత సమయం పడుతోందని, అందుకు అవకాశం ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వ అధికారులు మనవి చెయ్యడంతో జూన్ 19వ తేదికి చర్చలు వాయిదా వేశారు. ఈ సందర్బంగా ఇరు రాష్ట్రాల పోలీసులు సరిహద్దుల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil Nadu CM Palaniswami said the Irrigation Department of Andhra Pradesh has commenced construction of a check dam across river Kusa at Nelavayl village in Chittoor District there. Kusa was a sub-tributary of inter-state Kosasthalaiyar river, he said.
Please Wait while comments are loading...