Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అందుకే ఇలా: జగన్ పార్టీపై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు, బాబుకు చురక

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపైన ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఆ పార్టీ చిత్తశుద్ధితో పోరాడలేకపోయిందని విమర్శించారు.

చదవండి: శ్రీమతి ఆమ్రపాలి, వీడియో హల్‌చల్: కాశ్మీర్‌లో వైభవంగా కలెక్టర్ పెళ్లి (ఫోటోలు)

ఆయన ఓ వెబ్ సైట్ ముఖాముఖిలో మాట్లాడారు. ఈ నాలుగేళ్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను, ఎంపీలను కాపాడుకోలేకపోయిందని తమ్మారెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీలో ఏదో చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తోందన్నారు.

చదవండి: బాబుకు రివర్స్: బీజేపీ మంత్రుల రిజైన్? మిస్టర్ సీఎం.. విష్ణు

ఏదో చేస్తున్నామని చెప్పేందుకే

ఏదో చేస్తున్నామని చెప్పేందుకే

ఏపీ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏదో చేస్తున్నామని చెప్పుకోవడానికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారన్నారు. టీడీపీని, చంద్రబాబును తిట్టడం తప్ప ఏమీ లేదన్నారు.

చంద్రబాబును తిట్టడం మినహా ఏమీ లేదు

చంద్రబాబును తిట్టడం మినహా ఏమీ లేదు

వైసీపీకి, ఆ పార్టీ అధినేతకు ఎప్పుడు చంద్రబాబును తిట్టడం లేదా అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం అనడం మించి మరొకటి లేదని ఎద్దేవా చేశారు. కానీ వైసీపీ ఏపీ విషయంలో ఏమీ చేయలేదన్నారు.

Recommended Video

    Why Babu Saying No For No Confidence Motion ?
    టీడీపీ కూడా చేసిందేమీ లేదు

    టీడీపీ కూడా చేసిందేమీ లేదు

    ఏదైనా నిజాయితీగా ఆలోచించాలని, అలా ఆలోచించి చేయాలని తమ్మారెడ్డి అన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ఏపీకి చేసింది ఏమీ లేదన్నారు. బీజేపీ, టీడీపీ పబ్బం గడిచిపోయిందని, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా రాజ్యాధికారం నడిచిందన్నారు.

    పార్టీలపై విమర్శలు

    పార్టీలపై విమర్శలు

    కాగా, పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి, ఇటీవల రాజకీయాల్లో కీలకంగా మారిన నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు మద్దతు పలుకుతున్నారు. ఇప్పుడు తమ్మారెడ్డి వైసీపీ, టీడీపీలపై విమర్శలు చేయడం గమనార్హం.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+