శ్రీమతి ఆమ్రపాలి, వీడియో హల్‌చల్: కాశ్మీర్‌లో వైభవంగా కలెక్టర్ పెళ్లి (ఫోటోలు)
Recommended Video

వరంగల్/శ్రీనగర్: వరంగల్ జిల్లా అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి కాటా వివాహం జమ్ము కాశ్మీర్‌లోని ఆర్కే రెసిడెన్సీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం జరిగిన ఈ పెళ్లికి వరంగల్ జిల్లా నుంచి కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు.
ఆమ్రపాలి ఐపీఎస్ అధికారి సమీర్ శర్మను పెళ్లి చేసుకున్నారు. జిల్లా నుంచి పెళ్లికి హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు కొత్త దంపతులను ఆశీర్వదించారు. బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

ఆమ్రపాలి పెళ్ళికి వీరు హాజరు
ఆమ్రపాలి పెళ్లికి ఇరు కుటుంబాల వారు, బంధువులు, స్నేహితులతో పాటు వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ శ్రృతి ఓజా, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తక్కెళ్లపల్లి రవీంద్రరావు, వరంగల్ అర్బన్ కలెక్టర్ సిబ్బంది, మరికొంతమంది ముఖ్యులు హాజరయ్యారు.

ఉంగరాలు మార్చుకున్నారు
సమీర్ శర్మ బంధుమిత్రులు, స్నేహితులతో కలిసి బరాత్‌తో కళ్యాణ మండపానికి చేరుకున్నారు. పెళ్లికి సంబంధించి కొన్ని ఫోటోలు మాత్రమే బయటకు వచ్చాయి. సాయంత్రం ఇరువురు ుంగరాలు మార్చుుకున్నారు. ఆమ్రపాలిని సంప్రదాయ పద్ధతిలో పెళ్లి కూతురుగా అందంగా ముస్తాబు చేశారు.

ఆకర్షణగా దుస్తులు
పెళ్ళి సందర్భంగా వధువు ఆమ్రపాలి, వరుడు సమీర్ శర్మ ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ కాశ్మీరీ దుస్తుల్లో ఆమ్రపాలి మెరిసిపోయారు. సోమవారం సాయంత్రం జమ్మూ మార్బుల్ మార్కెట్లోని కింగ్స్ విల్లేలో విందు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆమ్రపాలి ఇలా
ఆమ్రపాలి ఎరుపు రంగు గాగ్రాకు, అదే రంగులో, బంగారు రంగు బార్డర్ ఉన్న ఛోళీని తలపై నుంచి కిందరవరకు కప్పుకొని, రెండు చేతులకూ మణికట్టు వరకు మ్యాచింగు గాజులు, నుదుట పాపిట బిళ్లను ధరించారు.

ఈ వీడియో హల్‌చల్
మరోవైపు, ఆమ్రపాలి, సమీర్ శర్మల పెళ్లి వీడియో ఒకటి సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది. ఈ వీడియో నిడివి రెండు నిమిషాలకు పైగా ఉంది. ఈ వీడియోలో ఆమ్రపాలి - సమీర్ శర్మలు ఉంగరాలు మార్చుకుంటున్న సన్నివేశాలు ఉన్నాయి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications