విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కనకదుర్గ ఆలయంలో తాంత్రిక పూజలు నిజమేనట...మాటమార్చిన ఈవో...సంచలనం

|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడ కనకదుర్గ ఆలయంలో అగంతక వ్యక్తులు తాంత్రిక పూజలు నిర్వహించడం వాస్తవమేనని నిర్థారణ అయినట్లే. తొలుత సిసి పుటేజ్ లోని ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరో తనకు తెలియదన్న ఈవో ఆ తరువాత మాట మార్చడంతో రహస్య పూజలపై అనుమానాలు బలపడ్డాయి.

బెజవాడ కనక దుర్గ ఆలయంలో గత కొన్ని రోజులుగా అర్థరాత్రి పూజలు జరిగిన విషయం వాస్తమేనని దాదాపుగా నిరూపణ అయినట్లే. డిసెంబర్ 26 వ తేదీ ఆలయంలో గుర్తు తెలియని కాషాయధారణ వ్యక్తి సంచారం సిసి కెమేరాలో రికార్డయింది. ఇప్పుడు ఆ సిసి కెమెరా ఫుటేజ్ అత్యంత కలకలం సృష్టిస్తోంది. మొదట ఆ సిసి కెమేరా పుటేజ్ లోని వ్యక్తి ఎవరో తనకు తెలియదన్నఈ వో సూర్యకుమారి ఆ తరువాత మాటమార్చారు. అతడు ఆలయం శుభ్రం చెయ్యడానికి దేవాలయంలోకి అనుమతించినట్లు చెబుతున్నారు. దీంతో వేళ కాని వేళలో ఆలయంలో కాషాయం ధరించిన వ్యక్తి రహస్యంగా మసలడంతో ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహించడం జరిగే ఉంటుందని అందరూ భావిస్తున్నారు.

 అర్థరాత్రి...ఆగమశాస్త్రానికి విరుద్దంగా...

అర్థరాత్రి...ఆగమశాస్త్రానికి విరుద్దంగా...

ఆలయలో అర్థరాత్రి వేళ ఆగమ శాస్త్రానికి విరుద్దంగా జరిగే పూజలు తాంత్రిక పూజలు, క్షుద్రపూజలు మాత్రమేనని పండితులు చెబుతున్నారు.
పవళింపు సేవ తరువాత దేవాలయం తలుపులు మూసివేస్తారని, దేవాలయ నిబంధనలను ఉల్లంఘించి మూసిన తలుపులు రహస్యంగా తెరిచి ఆలయంలో అడుగుపెట్టాల్సిన అవసరం ఏముంటుందనేది ఆలయ అర్చకుల ప్రశ్న.

 అందుకేనా...భైరవి ఫూజలకేనా...

అందుకేనా...భైరవి ఫూజలకేనా...

కనకదుర్గ ఆలయంలో అర్థరాత్రి ఆగమ శాస్త్రానికి విరుద్దంగా జరిగేది భైరవి పూజలుగా పండితులు అభిప్రాయపడుతున్నారు. అదనపు శక్తుల కోసం ఈ పూజలు చేస్తారని చెబుతున్నారు. ఆ సమయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేస్తారని , విజయవాడలో కూడా అలా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారని అంటున్నారని వీటన్నిటిని బట్టి ఆలయంలో తాంత్రిక పూజలు జరిగినట్లే తెలుస్తోందని అంటున్నారు.

 మాట మార్చిన ఈవో...

మాట మార్చిన ఈవో...

తొలుత డిసెంబర్ 26 వ తేదీ ఆలయంలోని సిసి ఫుటేజ్ లో రికార్డయిన గుర్తు తెలియని వ్యక్తి ఎవరో తనకు తెలియదన్న ఈవో సూర్యకుమారి ఆ తరువాత మాట మార్చడం తాంత్రిక పూజలపై అందరి అనుమానాలను బలపర్చినట్లయింది. మొదట ఆ సిసి ఫుటేజ్ లోని వ్యక్తి తనకు తెలియదన్న ఈవో ఆ తరువాత అతడు ఆలయం శుభ్రపరిచేందుకు వచ్చాడని, తామే అనుమతించామని అంటున్నట్లు తెలిసింది. అయితే అలా ఆలయాన్ని శుభ్రపరుస్తున్నదృశ్యాలేవీ సిసి కెమేరాలో రికార్డ్ కాకపోవడం గమనార్హం.

ఎవరి కోసం...ఎందుకోసం...తెలియాల్సిందే...

ఎవరి కోసం...ఎందుకోసం...తెలియాల్సిందే...

కనకదుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరగడం నిజమేనని దాదాపుగా నిరూపణ అయిన నేపథ్యంలో ఈ తాంత్రిక పూజలను ఎవరి కోసం చేయిస్తున్నారు...ఎందుకోసం చేయిస్తున్నారో నిగ్గు తేల్చాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇది అసాధారణ విషయమని ఈ విషయంపై స్పష్టత రాకుంటే భక్తుల్లో,ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతాయని అంటున్నారు. ఆ పరిస్థితి రాకుండా అసలు వాస్తవాలు ఏమిటో వెలికితీసి జనాల ముందు ఉంచాల్సిన బాధ్యత అటు ఆలయ పాలకవర్గాలు, పోలీసు శాఖ,ప్రభుత్వం పై ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

English summary
In Vijayawada Kanakadurga temple, it is confirmed that the conducting of Tantric Poojas is a reality. Firstly, the suspicions on secret poojas were strengthened when the EO change her word about unknown person in cc footage. Now that the CC camera footage is creating a lot of doubts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X