మహిషాసుర మర్థినిని మేలుకొల్పేందుకే...దుర్గమ్మకు రహస్య పూజలు...

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

విజయవాడ: విజయవాడ కనక దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజల వంటివి ఏమీ జరగలేదంటున్నారు ఆలయ ఈవో . అయితే ఏం జరిగిందో మాత్రం సూటిగా,స్పష్టంగా చెప్పడంలేదు. ఆలయ శుద్ది జరిగిందంటున్నారు కానీ అందుకు ఏ ఆధారం కనిపించడం లేదు. తాంత్రిక పూజలు జరగలేదంటున్నారు కానీ ఆధారాలను బట్టి చూస్తే రహస్య పూజలు జరిగినట్లే కనిపిస్తున్నాయి.

  దుర్గ గుడిలో తాంత్రికులతో భైరవీ పూజ !

  "దుర్గగుడిలో ఆగమ శాస్త్ర విరుద్ధంగా ఎలాంటి పూజలూ జరగలేదు. తాంత్రిక పూజలు అసలే జరగలేదు. డిసెంబరు 26వ తేదీ రాత్రి కేవలం ఆలయ శుద్ధి మాత్రమే జరిగింది"...ఇవి బెజవాడ కనకదుర్గ ఆలయంలో రహస్య పూజలు జరిగాయన్న ఆరోపణలపై ఈవో సూర్యకుమారి ఇచ్చిన వివరణ. అయితే తన వాదనకు ఆమె ఏ ఆధారాన్ని చూపలేకపోయారు. పైగా అమ్మవారి గుడిలో లభ్యమైన ఆధారాలన్నీ అక్కడ "ఏవో ఫూజలు" జరిగాయన్నట్లే నిరూపిస్తున్నాయి. పైగా ఈ వివాదం సందర్భంగా తలెత్తిన సందేహాల్లో ఒక్కదానికైనా అధికారులు సూటిగా సమాధానం ఇవ్వలేకపోతుండటం గమనార్హం.

   ప్రాధమికంగా చూస్తే...

  ప్రాధమికంగా చూస్తే...

  దుర్గమ్మ గుడిలో రహస్య పూజలు జరగలేదని వివరణ ఇచ్చేందుకు ని చెప్పుకొనేందుకు ఆలయ అధికారులు నానా అవస్థలు పడ్డారు. ఆలయ శుద్ధి మాత్రమే జరిగిందని...ఇంకేమీ జరగలేదని అంటున్నారు. కానీ డిసెంబరు 26వ తేదీ రాత్రి మాస దుర్గాష్టమి రోజు రాత్రి అనధికారికంగా రహస్యంగా పూజలు జరిగినట్లే ఆధారాలు సూచిస్తున్నాయి. ఇదే విషయం పోలీసుల ప్రాథమిక విచారణలోను తేలినట్లు సమాచారం.

   వివరణలు ఇలా...

  వివరణలు ఇలా...

  వివరణల్లో నిజమెంత...
  దేవాలయంలోకి అగంతకులను ఎందుకు అనుమతించారంటే...ఆలయ శుద్ధి కోసమేనని అధికారులు వివరణ ఇస్తున్నప్పటికీ అందులో నిజం కనిపించడం లేదు. నిజంగా శుద్ధి జరిగినట్లయితే నేలను మాత్రమే శుభ్రం చేయాలి...అమ్మవారి విగ్రహానికి అలంకారాలు చేయకూడదు... అయితే...ఆ సమయంలో అమ్మవారి అలంకరణ కోసం తాజా పూలదండలు తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మరోవైపు అధికారులు చెబుతున్నట్లు ఆలయ శుద్ధి జరుగుతున్న దృశ్యాలు ఎక్కడా ఏమీ సిసి కెమెరాల్లో నమోదు కాలేదు. అలాగే
  శుద్ది చేస్తే ఆలయంలో దీపం, కర్పూర హారతి తాలూకు మసి కొంచెమైనా పోవాలి కానీ అలా ఏమీ జరగలేదు. ఎందుకు పోలేదని ఆ మరుసటి రోజున అంతరాలయాన్ని చూసిన వారు ప్రశ్నిస్తున్నారు.

   సమయం చాలా ముఖ్యం...

  సమయం చాలా ముఖ్యం...

  ఆలయంలో పూజాధికాలు, నైవేద్య సమర్పణ, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రత్యేక సమయాలు ఉన్నాయి. వీటి విషయంలో చాలా పట్టింపు ఉంటుంది. కానీ ఈ సమయాలకు విరుద్ధంగా అంతరాలయాన్ని ఒకసారి మూసివేసిన కొద్దిసేపటికే శుద్ధి పేరుతో తిరిగి తెరిచామనడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆలయానికి సంబంధం లేని వ్యక్తులు కాషాయధారణలతో ఆ సమయంలో అక్కడ ఎందుకున్నారనే ప్రశ్నకు సరైన సమాధానమే లేదు.

   అమ్మవారు...భీకర రూపంలో...

  అమ్మవారు...భీకర రూపంలో...

  నిజానికి బెజవాడ కనకదుర్గ ఆలయంలో అమ్మవారు మహిషాసుర మర్థినిగా భీకర రూపంలో కొలువై ఉంది. కానీ, ఆనాడు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని సాత్విక రూపంలోకి తెచ్చి...లలితా స్వరూపిణిగా కొలువుదీర్చారు. అమ్మవారి అలంకరణలు, పూజలన్నీ దీని ప్రకారమే జరుగుతాయి. కానీ తమ సమస్యలను తొలగించుకుంనేందుకు, అదనపు శక్తులు, అతీత శక్తులు పొందేందుకు ఆలయ అధికారి ఒకరు ‘భైరవీ పూజ'కు సిద్ధమయ్యారనే ప్రచారం బలంగా సాగుతోంది. అందుకే లలితా స్వరూపిణిగా ఉన్నఅమ్మవారిలో అసలు స్వరూపమైన మహిషాసురమర్దిని రూపం కనిపించకుండా రక్షణగా ఉంచిన కవచాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. పైగా అమ్మవారికి ఐదు చీరెలు ధరింపచేశారు. దశ మహా విద్యలలో భైరవీ తంత్రం ఒక ప్రత్యేక పూజా ప్రక్రియగా చెబుతారు.

   ఆ సమయంలో...కదంబ నైవేద్యం...

  ఆ సమయంలో...కదంబ నైవేద్యం...

  అమ్మవారు శక్తి స్వరూపిణిగా ఉన్నప్పుడు మాత్రమే కదంబ నైవేద్యం పెడతారు. ఇక్కడ కూడా పూజ అనంతరం అమ్మవారికి గుమ్మడికాయ, కంద, ఇతర కూరగాయాలతో వండిన కదంబాన్ని నైవేద్యంగా పెట్టినట్లుగా తెలిసింది. మాధవ్‌ అనే వ్యక్తి కదంబ ప్రసాదాన్ని తయారు చేశారట. ఆయన కూడా ఇంత రాత్రి సమయంలో కదంబ ప్రసాదాన్ని తయారు చేయడమేమిటని తొలుత సందేహించినా...ఉన్నతాధికారుల స్పష్టమైన ఆదేశం కావడంతో...తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చి, ప్రసాదాన్ని వండి వంటశాలలోనే ఉంచివెళ్లినట్లు తెలిసింది. అనంతరం ఈ రహస్య పూజలు నిర్వహించిన వారే ఆ ప్రసాదాన్ని ఆలయంలోకి తీసుకెళ్లినట్లు తెలిసింది.

   ఇంతకీ...వారెవరంటే...

  ఇంతకీ...వారెవరంటే...

  సీసీ కెమేరా ఫుటేజ్‌లో కాషాయ దుస్తుల్లో కనిపించిన వ్యక్తి దుర్గగుడి ప్రధానార్చకుడు బద్రీనాథ్‌ మేనల్లుడు పార్థసారథి అలియాస్‌ రాజాగా గుర్తించారు. ఆయన ప్రస్తుతం కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామంలో అర్చకుడిగా పని చేస్తున్నారు. ఇక బద్రీనాథ్‌కు సోదరుడైన సృజన్‌ అనే అర్చకుడినీ గుంటూరు జిల్లా భట్టిప్రోలు నుంచి ప్రత్యేకంగా పిలిపించినట్లు తెలిసింది. మరో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కూడా ఈ పూజల్లో పాల్గొన్నట్లు సమాచారం. వారెవరో తెలిస్తే అసలు ఈ రహస్య పూజల వివాదం తేలిపోనుంది.

   అధికారులు ఇలా అన్నారు...

  అధికారులు ఇలా అన్నారు...

  ఆలయంలోకి కొత్త వ్యక్తిని తీసుకురావడంపై విచారణకు ఆదేశించాం. అలా తెచ్చినందుకు బద్రీనాథ్‌ బాబును కొండ దిగువన ఉపాయాలయానికి బదిలీ చేశాం. ఆయనకు చార్జిమెమో కూడా ఇచ్చాం అని ఈవో సూర్యకుమారి వివరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు బద్రీనాథ బాబు తనపై విమర్శలకు వివరణ ఇస్తూ ఆలయంలో తాంత్రిక పూజలు జరగలేదని ,కేవలం శుద్ధి కోసమే ఆలయాన్ని తెరిచామని పునరుద్ఘాటించారు. అక్కడ పురుగులు, బొద్దింకలు తిరుగుతుంటాయి. అమ్మవారికి కట్టిన చీరలకు కూడా చిన్న చిన్న బెజ్జాలు పడ్డాయి. వాటిని సరిచేయడానికే ఆలయాన్ని మళ్లీ తెరిచాం అని చెప్పారు.

   పోలీసుల విచారణ...

  పోలీసుల విచారణ...

  దుర్గగుడి ఆలయంలో అనధికార పూజలపై పోలీసులు తమంతట తాముగా విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై ఆలయ అధికారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందనప్పటికీ మీడియాలో తాంత్రిక పూజల గురించి కథనాలు వెలువడిన నేపథ్యంలో తమంతట తామే విచారణ జరిపారు. బద్రీనాథ్‌ పిలుపు మేరకు గుడికి వచ్చి పూజలో పాల్గొన్న కాషాయధారి పార్థసారథి అలియాస్‌ రాజును వన్‌టౌన్‌ సీఐ కాశీ విశ్వనాథ్‌ ప్రశ్నించారు. ఈ విచారణలో ఆయన సంచలన విషయాలు బైటపెట్టినట్లు తెలిసింది. పూజలు నిర్వహించామని, అమ్మవారి కవచాన్ని తొలగించి. అసలు స్వరూపమైన మహిషాసురమర్దినికే పూజలు చేశామని పార్థసారథి పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

   సిఎం పేషీ విచారణకు ఆదేశం...

  సిఎం పేషీ విచారణకు ఆదేశం...

  దుర్గగుడిలో అర్ధరాత్రి పూజలపై పూర్తి సమాచారం ఇవ్వాల్సిందిగా సీఎం పేషీ ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు ఈ సంఘటనలపై దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు కూడా విచారణకు ఆదేశించారు. అయితే ఆలయంలో క్షద్రపూజలు జరగలేదని మంత్రి అంటున్నారు. ప్రధానార్చకుడైన బద్రీనాథ్‌ తనతోపాటు మరో ఆలయానికి చెందిన అర్చకుడిని అలంకరణకు గర్బగుడిలోకి తీసుకెళ్లడం వివాదాస్పదమైంది.
  వంశపారంపర్యంగా వచ్చే ప్రధాన అర్చకులకు, తప్ప వేరే ఆలయాలకు చెందిన అర్చకులకు ఆ ఆలయంలోకి ప్రవేశం ఉండదు. బద్రీనాథ్‌కు అనారోగ్యం, స్థూలకాయం కారణంగా ఆయనతోపాటు వేరే అర్చకుడిని గర్భ గుడిలోకి తీసుకువెళ్లి ఆలయాన్ని శుభ్రం చేసి, అలంకరణ మాత్రమే చేశారు అని మంత్రి మాణిక్యాలరావు వివరించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Vijayawada Kanakadurga Temple EO Surya Kumari speaking to media over Tantric Pooja that took place at Mid-Night on 26 December condemned the rumours. Giving clarity, she said temple Archakas hired outsiders for 'Aalaya Shudhi' and opened the temple again at mid night. EO Surya Kumari is responsible for tantric pujas to fight against the negativity & allegations she has been facing in various issues, say the sources.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి