తారకరత్న భార్య బిగ్ ట్విస్ట్ ..ఆ పార్టీకే మద్దతంటూ ప్రకటన
టీడీపీ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మొదటి రోజునే నందమూరి తారక రామారావు మనవడు, హీరో తారకరత్నకు గుండె పోటు వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా ఆయన కొద్ది రోజులకే మృతి చెందారు. తారకరత్న మరణంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఒంటరైయ్యారు. తారకరత్న మరణాన్ని ఆమె ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇదిలా ఉంటే తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతుగా నిలుస్తారనే అనుమానం అందరిలోనూ నెలకొంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. అలేఖ్య రెడ్డి భర్త తారకత్నది టీడీపీ కుటుంబం. అలాగే అలేఖ్య రెడ్డికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గర బంధువు అవుతారనే విషయం అందరికి తెలిసిందే. ఇటీవల ఉగాది వేడుకులను అలేఖ్య రెడ్డి నివాసంలోనే జరుపుకున్నారు విజయసాయిరెడ్డి.

ఈ సందర్భంగా అలేఖ్య రెడ్డి స్పందిస్తూ..మా జీవితంలో నాన్నలాంటి గొప్పవ్యక్తి విజయసాయిరెడ్డి అంకుల్..ఆయన ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉంటాయని అలేఖ్య రెడ్డి చెప్పుకొచ్చారు.మా కష్టసుఖాల్లో మాతోనే ఉంటూ ధైర్యం చెప్పే వ్యక్తి విజయసాయిరెడ్డి అని ఆమె తెలిపారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండి కూడా మాకోసం విజయసాయిరెడ్డి స్పెషల్‌గా రావడాన్ని మించిన సంతోషం మరొకటి లేదని అలేఖ్యారెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో మాతో ఉంటే ఆ విలువేంటో ఆయనకే తెలుసని అలేఖ్య రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఆమె వైసీపీకి మద్దతుస్తున్నారనే ప్రచారం జరిగింది.
తాజాగా దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో తన మద్దతు బాలయ్య మామయ్యేకే అంటూ ఆమె టీడీపీకే ఓటు వేశారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాలకృష్ణ ఆయన తనయుడు మోక్షజ్ఞతో ఉన్న ఫొటోను ఆమె షేర్ చేస్తూ..నేను ఏ వైపు ఉన్నానని ఎప్పుడూ నాకు ప్రశ్నలు ఎదురు అవుతూనే ఉన్నాయి. కానీ దానికి ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకున్నాను.నా అంగీకారం, ప్రేమ నా కుటుంబం వైపే ఉంటాయంటూ తన పోస్ట్‌లో ఈ విధంగా రాసుకొచ్చారు. దీంతో ఆమె తన భర్త కుటుంబంలోని వ్యక్తికే మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. అలేఖ్య రెడ్డి చేసిన ఈ పోస్ట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications