తీరని తారకరత్న రాజకీయ కోరిక - చంద్రబాబు అంగీకారం..!!
తారకరత్న రాజకీయ కోరిక నెరవేర లేదు. చంద్రబాబు, లోకేష్ తోనూ చర్చలు చేసారు.
నందమూరి తారకరత్న రాజకీయం కోరిక నెరవేరలేదు. తారకరత్న వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకున్నారు. పార్టీ కోసం పని చేయాలని..అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు.ఇందులో భాగంగానే లోకేష్ పాదయాత్రకు మద్దతుగా యువగళం ప్రారంభం వేళ కుప్పంకు వెళ్లారు. అక్కడే తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. 23 రోజులు మృత్యువుతో పోరాటం చేసి కన్నుమూసారు.
అయితే..తాను రాజకీయంగా పని చేసే అంశం పైన పార్టీ అధినేత చంద్రబాబు..లోకేష్ తో తారకరత్న చర్చలు చేసారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారంటూ అప్పట్లోనే తారకరత్న చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారి తీసాయి. కానీ, తారకరత్న రాజకీయ కోరిక మాత్రం నెరవేరకుండానే ఆయన దూరమయ్యారు.

టీడీపీ అధికారంలోకి రావాలంటూ
కొద్ది నెలలుగా తారకరత్న పార్టీ వ్యవహారాల పైన ఆసక్తి చూపించారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పార్టీకి ప్రచారం చేయటంతో పాటుగా అవకాశం ఇస్తే ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు. ఇందు కోసం చంద్రబాబు - లోకేష్ తో కూడా చర్చించారు. తన మనసులో మాట వారితో పంచుకున్నారు. పార్టీ కోసం పని చేయాలని..సీటు విషయంలో నిర్ణయం తీసుకుందామని హామీ ఇచ్చినట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు.
ఒక దశలో గుడివాడ నుంచి తారకరత్న పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. గుడివాడలో ఎలాగైనా ఈ సారి గెలవాలనే లక్ష్యంతో ఉన్న టీడీపీ అక్కడ నుంచి నందమూరి కుటుంబానికి చెందిన వారిని బరిలోకి దింపాలని భావిస్తోందనే వాదన ఉంది. దీంతో..తారకరత్న ఇదే అంశం పైన చర్చించినట్లు సమాచారం. సీటు పైన హామీ ఇవ్వకపోయినా.. తారకరత్న పోటీకి చంద్రబాబు అంగీకరించినట్లు గుర్తు చేసుకుంటున్నారు.

జూ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారంటూ..
కొద్ది నెలల క్రితమే ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొన్న తారకతర్న రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేసారు. జూనియర్ ఎన్టీఆర్ అవసరమైతే వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తారంటూ చెప్పుకొచ్చారు. తారకరత్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ జూనియర్ ఎన్టీఆర్ బెంగుళూరు వెళ్లి పరామర్శించారు.
జూనియర్ ఎన్టీఆర్ ఆస్పత్రికి వచ్చిన సమయంలో కర్ణాటక మంత్రి సుధాకర్ తో పాటుగా ప్రముఖ నటుడు శివన్న కూడా ఆస్పత్రికి వచ్చారు. తారకరత్న ను చూడగానే ఆస్పత్రిలో తారకరత్న ఎమోషనల్ అయ్యారు. తారకరత్న కోలుకుంటారని జూనియర్ ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేసారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రతీ రోజు తారకరత్న ఆరోగ్యం పైన వాకబు చేస్తూనే ఉన్నారు. తారకరత్న కుటుంబ సభ్యులకు ఓదార్పు ఇచ్చారు.
ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తితో..
కొద్ది రోజుల క్రితమే లోకేష్ తో తారకరత్న భేటీ అయ్యారు. ఆ సమయంలో పార్టీ కోసం తాను సేవలు అందించాలనుకుంటున్నట్లుగా చెప్పారు. దీంతో..తారకరత్న ను అవకాశం ఉంటే ప్రత్యక్ష ఎన్నికల బరిలో దించాలని..ప్రచారంలో తారకరత్న సేవలను వినియోగించుకోవాలని భావించారు.
లోకేష్ పాదయాత్ర వేళ ఆయనను కలిసిన తారకరత్న ఆ తరువాత యవగళం ప్రారంభం వేళ కుప్పంకు వెళ్లారు. అక్కడ లోకేష్ పాదయాత్ర సక్సెస్ కావాలని కోరుకున్నారు. కాసేపటికే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆ రోజు లోకేష్ ఆస్పత్రికి వెళ్లి తారకరత్నను పరామర్శించారు. ఇప్పుడు పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించిన లోకేష్ హైదరాబాద్ బయల్దేరారు. రేపు తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి. తారకరత్న మరణంతో నందమూరి కుటుంబ సభ్యులు విషాదంలో ఉండిపోయారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications