Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెట్రోల్, డీజిల్ ధరలపై టీడీపీ పోరు .. గ్యాస్ సిలెండర్ కు పాడె కట్టి, ట్రాక్టర్లు, ఆటోలు తాళ్ళతో లాగి నిరసనలు

విపరీతంగా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల కట్టడిలో ఏపీ సర్కార్ విఫలమైందని తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పెరిగిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టింది. వినూత్నంగా నిరసనలు తెలియజేసి జగన్ సర్కార్ పై విరుచుకుపడింది టిడిపి.

డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలకు నిరసనగా కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు

ఏపీలో పెరిగిన డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలకు నిరసనగా తెలుగు తమ్ముళ్లు కదంతొక్కారు. జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ టాక్స్ గురించి నాడు గొంతు చించుకున్న జగన్ రెడ్డి, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడుసార్లు వ్యాట్ పెంచి అదనంగా రోడ్ డెవలప్మెంట్ సెస్ బాదుడుతోనూ ఏపీ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని టిడిపి నేతలు ధ్వజమెత్తారు. భారతదేశంలో కెల్లా ఏపీలోనే అతి ఎక్కువ పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయని టీడీపీ నేతలు మండిపడ్డారు.

ట్రాక్టర్లను, ఆటోలను తాళ్లతో కట్టి లాగుతూ వినూత్న నిరసనలు

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా ట్రాక్టర్లను, ఆటోలను తాళ్లతో కట్టి లాగుతూ, సైకిళ్లపై ర్యాలీ చేస్తూ, ఎడ్లబండ్లతో ప్రదర్శన చేస్తూ, గ్యాస్ బండ లకు పాడె కట్టి దహనం చేసి, జగన్ మనసు మారాలని దేవుళ్లకు రోడ్లపై కొబ్బరికాయలు కొట్టి వినూత్నంగా నిరసనలు తెలియజేశారు. ఏపీలో పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలకు నిరసనగా బాపట్లలో తెలుగు తమ్ముళ్లు వినూత్న నిరసన ను నిర్వహించారు .భావ దేవుడికి 108 కొబ్బరికాయను కొట్టి జగన్మోహన్ రెడ్డి దోపిడి మనస్తత్వం మారేలా చూడాలని ప్రార్థించారు. ధరలు దిగి రావాలంటే, జగన్ దిగి పోవాలంటూ నినాదాలు చేశారు.

ఎడ్ల బండ్లతో నిరసన ర్యాలీ నిర్వహించిన దేవినేని ఉమా

పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలంటూ తెలుగుదేశం పార్టీ నిరసనలో భాగంగా మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో మాజీ మంత్రి దేవినేని ఉమా వినూత్న నిరసన ర్యాలీ నిర్వహించి జగన్ సర్కార్ పై ధ్వజమెత్తారు. ఎడ్ల బండిపై గ్యాస్ సిలెండర్, బైక్ లను తీసుకు వెళ్తూ నిరసన వ్యక్తం చేశారు . ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించిన టిడిపి నేతలు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసే పరిస్థితి లేదని సెంచరీ ని దాటి సాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుల నడ్డి విరుస్తోందని మండిపడుతున్నారు.

నాడు నేడు.. ఓ ప్రత్యేక స్కూటర్ తో ధరలపై ప్రచారం

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల పై నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని టీడీపీ నేత బీటెక్ రవి ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శించారు. రిక్షాలు తొక్కుతూ, ఆటోలకు తాళ్ళు కట్టి లాగుతూ టిడిపి నేతలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసిన పాపానికి పెట్రోల్ పంప్ లే ఉరితాళ్లు అవుతున్నాయి అంటూ, అదే ఫ్యాన్ కు పెట్రోల్ పోసే పైపులతో ఉరేసుకుని చచ్చే రోజులు వచ్చాయని విమర్శిస్తున్నారు. ఇక నాడు నేడు అంటూ టిడిపి హయాంలో ఉన్న రేట్లను నేడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన లో ఉన్నా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ రేట్లను తెలియజేసేలా ఓ స్కూటర్ ను తయారు చేసి విచిత్ర వాహనాన్ని తిప్పుతూ నాడు నేడు అంటూ నర్సీపట్నం తెలుగుదేశం శ్రేణులు జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు.

 సైకిల్ ర్యాలీ నిర్వహించిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

సైకిల్ ర్యాలీ నిర్వహించిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

వేమూరు లో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం శ్రేణులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ను ఎడ్లబండిపై తీసుకెళ్లి పంట కాలువలో పడేసి వినూత్న నిరసనకు దిగారు. పెట్రోల్, డీజిల్ ధరలను కట్టడి చెయ్యకుంటే వాహనాలను పంట కాలవల్లో పడెయ్యాల్సిందే అంటూ అసహనం వ్యక్తం చేశారు. ట్రాక్టర్, ఆటోలను తాళ్లతో లాగుతూ, బైక్ లను రిక్షా ఎక్కించి తొక్కుతూ, పెళ్లి కార్లను, లారీలను తాళ్లతో లాగుతూ తమ నిరసన తెలియజేస్తున్నారు. నల్లటి కండువాలను ధరించి తమ నిరసన తెలియజేశారు.

పాలకొల్లులో నిమ్మల రామానాయుడు నిరసన .. కాల్వ శ్రీనివాసులురెడ్డి అరెస్ట్

కరోనా కష్టకాలంలో జగన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచారని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ఇక నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న టిడిపి నేతలు పలువురిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా టీడీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపు లో భాగంగా బొమ్మనహాల్ మండలంలో పాదయాత్ర చేస్తున్న మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులును అరెస్ట్ చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.

Recommended Video

    Afghanistan: Taliban డెడ్ లైన్.. తాలిబన్లపై పోరాడే వారికి పాశ్చాత్య దేశాల మద్దతు || Oneindia Telugu

    పోలీసు అరెస్టులపై ధ్వజమెత్తిన టీడీపీ నాయకులు ... ధరల కట్టడికి డిమాండ్

    ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసలు చేసే హక్కులను పోలీసు అరెస్టులతో అణిచివేయాలనుకోవడం జగన్ నియంతృత్వ ధోరణికి నిదర్శనం. వెంటనే పెరిగిన పెట్రోల్, డీజల్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలపై టిడిపి భగ్గుమంది. జగన్ ప్రభుత్వాన్ని ధరలు తగ్గించాలని డిమాండ్ చేసింది. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతంగా మారుస్తామని తెలుగు దేశం పార్టీ హెచ్చరికలు జారీ చేస్తోంది. జగన్ సర్కార్ నిరంకుశ ధోరణి విడనాడాలని, ధరల తగ్గింపు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+