తెలంగాణతో నష్టపోయాం, కాదని రాహుల్ ధైర్యం: టార్గెట్ కాపు, చిరంజీవి కీ రోల్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చి నష్టపోయామని ఏపీ నేతలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్ని పార్టీలు కోరితేనే విభజన జరిగిందని, దీనిని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో మనం విఫలమయ్యామని చెప్పారు.
గతం అంతా మరిచిపోవాలని, భవిష్యత్తు గురించి ఆలోచించాలని ఆయన ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించారు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు నేను వస్తానని ఆయన చెప్పారు. బలోపేతం కావడం ముఖ్యమని చెప్పారు.
కాపులు దరి చేరాలి....

కాంగ్రెస్ పార్టీకి దూరమైన కాపులు, ఎస్సీలను దరి చేర్చుకోవాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ... ఏదీ సాధ్యం కాదు అనుకోవద్దన్నారు. కాపులను, ఎస్సీలను దరి చేర్చుకోవాలని సూచించారు.
కాపు, ఎస్సీలను కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకుంటేనే మనుగడ అనుకుంటే అలా చేయాలని సూచించారు. ఏదీ సాధ్యం కాదని అనుకోవద్దన్నారు. పంజాబ్‌లో మనం ఎప్పటికీ గెలవలేమని అనుకున్నారని, ఆ తర్వాత ఏమైందని ప్రశ్నించారు. మీ పని మీరు చేయండని, మేం సహకరిస్తామని చెప్పారు.
అమరావతి రైతుల వినతి పత్రం
రాజధాని అమరావతి ప్రాంత రైతులు రాహుల్ గాంధీకి వినతి పత్రం ఇచ్చారు. తమ భూములు లాక్కుంటున్నారని వారు పేర్కొన్నారు.
చిరంజీవి కీ రోల్ పోషించేనా?
పార్టీకి దూరమైన కాపులను చేర్చుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవిని మరింత తెరపైకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తద్వారా కాపులను దరిచేర్చుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications