Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం జగన్ ఓటుకు నోటు కేసు ప్రస్తావన వెనుక - నెక్స్ట్ స్టెప్..!!

చంద్రబాబు అరెస్ట్ పై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. సాక్షాలు..ఆధారాలతో అడ్డంగా దొరికారని చెప్పుకొచ్చారు. పది గంటల సుదీర్ఘ వాదనల తరువాత కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించిందని చెప్పారు. కేంద్ర విచారణ సంస్థలు ఇప్పటికే ఈ కేసులో కొన్ని అరెస్ట్ చేసాయని వివరించారు. చంద్రబాబును రక్షించేందుకు కొందరు విశ్వప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదే సమయంలో ఓటు కు నోటు కేసును ప్రస్తావించారు. ఇదే ఇప్పుడు చర్చకు కారణమైంది.

చంద్రబాబు కేసుపై జగన్ స్పందన: ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు అరెస్ట్ సంచలనంగా మారింది. చంద్రబాబు అరెస్ట్ వెనుక జగన్ కుట్ర ఉందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ పైన తొలి సారి నిడుదవోలు సభలో సీఎం జగన్ స్పందించారు. సీఐడీ పూర్తి సమాచారంతో..అన్ని ఆధారాలతో అరెస్ట్ చేసిందని చెప్పుకొచ్చారు. ఫేక్ ఒప్పందంతో రూ 371 కోట్లు షెల్ కంపెనీలకు తరలించారని వివరించారు.

Targeting Opposition or Strengthening Ties: Jagan Vote-for-Note Discussion raises eyebrows amid CWC

అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఒత్తిడి చేసి సంతకాలు చేసి నిధులు విడుదల చేసారని చెప్పారు. చంద్రబాబు తప్పు చేసినట్లు నిరూపణ అయినా..కొందరు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ములాఖత్ కోసం వెళ్లి మిలాఖత్ అయ్యారని..ప్రశ్నిస్తానని చెప్పే వారు ప్రశ్నించరని పరోక్షంగా పవన్ పైన సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

ఓటుకు నోటు ప్రస్తావనతో: ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ తెలంగాణలో నాడు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బయటకు వచ్చిన ఓటు కు నోటు వ్యవహారాన్ని ప్రస్తావించారు. స్కిల్ స్కాం పైన చంద్రబాబు అరెస్ట్ గురించి వివరిస్తూ జగన్ ఈ కేసు ఇప్పుడు ఎందుకు ప్రస్తావించారనే ఆసక్తి కర చర్చ మొదలైంది. ఓటుకు నోటు కేసులో నల్లధనం తో..ఆడియో టేపుల్లో మాట్లాడిన గొంతు చంద్రబాబుదేనని తేలిన విషయాన్ని జగన్ గుర్తు చేసారు.

దీని ద్వారా చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్న వారిని ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహయా.. లేక చంద్రబాబు అవీనీతికి ఇవన్నీ సాక్షాలుగా చెప్పే ప్రయత్నం చేసారా అనే చర్చ సాగుతోంది. ఓటు కు నోటు కేసులో రేవంత్ పైన అభియోగాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల సమయం..సీడబ్ల్యూసీ సమావేశం వేళ జగన్ ఈ కేసు ప్రస్తావన చేయటం సంచలనంగా మారుతోంది.

రాజకీయంగా కొత్త చర్చ: ఓటు కు నోటు కేసులో చంద్రబాబు ప్రమేయం గురించే సీఎం జగన్ ప్రధానంగా వివరించే ప్రయత్నం చేసారు. దీని ద్వారా ఇప్పుడు ఈ కేసులో తెలంగాణలో మరోసారి ఏమైదా కదలిక ఉందా అనే చర్చ కూడా నేతల అంతర్గత చర్చల్లో మొదలైంది. ఇదే సమయంలో సీఐడీ తో పాటుగా కేంద్ర విచారణ సంస్థలు స్కిల్ స్కాం కేసులో కొందరిని అరెస్ట్ చేసిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు.

చంద్రబాబు ఎన్నో మోసాలకు పాల్పడ్డారని.. ఇన్నాళ్లు చంద్రబాబును పలుకుబడి కలిగిన ముఠా కాపాడింది అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు. చట్టం ఎవరికైనా సమానమేనని.. చంద్రబాబును కాపాడేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ప్రశ్నించడు అంటూ జగన్ విమర్శించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+