తొమ్మిది నెలలు.. లక్ష కోట్లు - ఏపీలో కొత్త రికార్డు..!!
ఏపీలో పన్నుల రాబడి కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో గడిచిన మూడు త్రైమాసికాల్లోనే పన్నుల రాబడి లక్ష కోట్లు దాటింది. రాష్ట్ర చరిత్రలో 9 నెలల కాలంలో ఈ స్థాయి లో పన్నుల రాబడి ఇదే తొలి సారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం పన్నుల రాబడి రూ.1,66,573.09 కోట్లుగా రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ఇందులో డిసెంబరు నాటికి 63.23 శాతం సమకూరినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2025-26 సంవత్సరం లో తొలి మూడు త్రైమాసికాల లెక్కలను కాగ్ విడుదల చేసింది.
ఏపీలో ముగిసిన మూడు త్రైమాసికాల లెక్కలను కాగ్ వెల్లడించింది. అందులో భాగంగా రాష్ట్ర పన్నుల వాటా బాగా పెరిగింది. ప్రధానంగా జీఎస్టీ, స్టాంపుల రిజిస్ట్రేషన్ల ఫీజు రూపంలో వచ్చిన మొత్తం, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, ఎక్సైజ్ సుంకం, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రాష్ట్ర రెవిన్యూ పపెరిగింది. కాగా, తాజా రిపోర్ట్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా పన్నుల ద్వారా రాబడి రూ.1,66,573.09 కోట్లుగా రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ఇందులో డిసెంబరు నాటికి 63.23 శాతం ఇప్పటికే సమకూరింది. కాగా, ప్రస్తుత జనవరి తో సహా మూడు నెలలు ఈ ఆర్దిక సంవత్సరంలో మిగిలి ఉంది. ఈ మూడు నెలల్లోనూ లక్ష్యానికి అనుగుణంగా రాబడి ఉంటే.. పూర్తి స్థాయి లక్ష్యం నెరవేరుతుంది. అదే విధంగా ఈ ఆర్దిక సంవత్సరంలో తొలి మూడు త్రైమాసికాల్లో రూ.19,224 కోట్లు మూలధన వ్యయాన్ని చేశారు. ప్రస్తుత ఆర్దిక సంవత్సరం లో 40 వేల కోట్ల వరకు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డిసెంబర్ నెలాఖరు వరకు రూ 19 వేల కోట్లు ఖర్చు చేసారు.

కాగ్ లెక్కలు
ఇక.. ఈ ఆర్దిక సంవత్సరంలో ప్రభుత్వం రూ 85,312 కోట్ల మేర రుణాలను తీసుకుంది. రెవిన్యూ లోటు రూ 60,480 కోట్లకు చేరింది. మొత్తం మీద రూ.33,185.97 కోట్ల రెవెన్యూ లోటు ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేసారు. ఇప్పుడు ఆ లెక్కకు మించి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తాజా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. రాబడి రూ.1,18,244.98 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం మాత్రం రూ.2,03,557.29 కోట్లుగా కాగ్ లెక్క తేల్చింది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం రాష్ట్ర పన్నుల రాబడి రూ.1,66,573.09 కోట్లుగా బడ్జెట్ లో అంచనా చూపించారు. అయితే, అక్టోబరు నెలాఖరుకు రూ.82,983.17 కోట్లుగా ఉన్నట్లు అధికారికంగా స్పష్టత వచ్చింది.
గత ఏడు నెలల్లో సగం రాబడి వచ్చింది. అదే విధంగా ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో ప్రభుత్వం బడ్జెట్ లో రూ రూ.79,926.89 కోట్ల మేరు రుణాలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడు నెలల కాలంలోనే రూ.67,283.53 కోట్ల రుణంగా కాగ్ వెల్లడించింది. ఇందులో రూ.37,178.69 కోట్ల నికర ప్రజా రుణం ఉండగా, మరో రూ.30,104.83 కోట్లు ఇతర మార్గాల్లో సేకరించారు. ఇక.. పన్నులు.. పన్నేతర రాబడి.. కేంద్ర గ్రాంట్లు మొత్తంగా రూ 91,538 కోట్లు రెవిన్యూ వచ్చినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, అంచనాలతో పోలిస్తే రెవెన్యూ లోటు ఇప్పటికే 44% అధికంగా ఉంది. మరో రెండు కాలం ఈ ఆర్దిక సంవత్సరంలో ఉండటంతో.. లక్ష్యాల మేరకు పన్ను వసూళ్లు సాధించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది.
-
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!












Click it and Unblock the Notifications