వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడిపీ 40సంవత్సరాల ప్రస్తానం.!గెలుపోటముల సమాహారం.!పూర్వవైభవం సాధిస్తామంటున్న తమ్ముళ్లు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ స్థాపించి నేటకి (మంగళవారానికి ) నలభై సవంత్సరాలు. ఈ నలభై సంత్సరాలలో అప్రతిహత విజయాలు ఎన్ని నమోదు చేసుకుందో అంతే స్థాయిలో పరాజయాలను కూడా మూటగట్టుకుండి. పార్టీ ప్రకటించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ రాజకీయంగా చరిత్ర సృష్టించింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు తనకు ఉన్న ప్రజాధారణను రాజకీయంగా మలుచుకుని సాహపోపేత నిర్ణయాలకు నాంది పలికారు. రాష్ట్ర రాజకీయాలనే కాకుండా కేంద్ర రాజకీయాలను సైతం శాసించే దిశగా తెలుగుదేశం పార్టీ ఆవిర్బవించి రాజకీయ విమర్శకుల ప్రశంసలు అందుకుని అప్రతిహతంగా ఎదురులేని పార్టీగా అవతరించింది.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం.. 40సంవత్సరాల సుధీర్గ ప్రయాణం

1982 మార్చి 29న ఆదర్శనగర్ న్యూ ఎమ్మెల్యే కాలనీలోని ప్రాంగణంలో కేవలం 40-50మంది సమక్షంలో రాజకీయ పార్టీ స్థాపిస్తున్నట్టు స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రకటించారు. కానీ ఆ ప్రకటన అనతి కాలంలోనే రాజకీయ ప్రకంపనలు సృష్టించి, రాజకీయ చరిత్రను మార్చివేస్తుందని అక్కడకు వచ్చిన ఎవ్వరూ కూడా అంచనా వేయలేక పోయారు. కానీ స్వర్గీయ ఎన్టీఆర్ ఎంతో ముందు చూపుతో, రాజకీయాలను సమూల ప్రక్షాళణ చేయాలనే మొండి పట్టుదలతో ఆనాడు వేసిన అడుగు నేటికీ ఎంతో మంది రాజకీయ నేతలకు దారి చూపిస్తోంది. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అని చెప్పిన ఎన్టీఆర్ మాటల్లో రాజకీయాల పట్ల ఎంతటి అంకితభావం ఉందో అర్థం చేసుకోవచ్చు.

సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు.. స్వర్గీయ ఎన్టీఆర్ వినూత్న దృక్కోణం

సమాజంలో పలుకుబడి పెంచుకోవడానికో, ఆస్తులను కాపాడుకోవడానికో, డబ్బులను సంపాదించుకోడానికో రాజకీయాలను ఉపయోగించుకోరాదని, రాజకీయం అంటే ఓ పవిత్ర ప్రజా సేవ లాంటిదని స్వర్గీయ ఎన్టీఆర్ రుజువు చేసారు. 1982 వరకూ ప్రజల్లో రాజకీయాల పట్ల ఉన్న అభిప్రాయాలను, రాజకీయ నాయకుల పట్ల ఉన్న భావాలను పటాపంచలు చేసి రాజకీయం అంటే ఇది అని ప్రత్యక్షంగా చేసి చూపించారు ఎన్టీఆర్. ఆత్మగౌరవం ఎంత గొప్పదో, మనస్సాక్షి కూడా అంతే గొప్పదని, మనస్సాక్షిని చంపుకుని రాజకీయాల్లో కొనసాగిననాడు నైతిక విలువలు పాతరేయబడాయని, రాజకీయాల్లో అందుకు విరుద్దంగా వ్యవహరించిన నాడు ప్రజల్లో సరైన గుర్తింపు వస్తుందని నూతన రాజకీయాలకు శ్రీకారం చుట్టారు స్వర్గీయ ఎన్టీఆర్.

రాజకీయ చరిత్రను మార్చేసిన ఎన్టీఆర్.. ఆత్మగౌరవ నినాదంతో పెను మార్పులు

1982లో స్వర్గీయ ఎన్టీఆర్ ఎవరికి ఐతే రాజకీయ అవకాశం కల్పించారో వారందరూ చాలా వరకూ అవినీతి రహిత నాయకులుగా ముద్రవేసుకుని పవిత్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రగా మారిన సంఘటనలు కూడా ఉన్నాయి. కేంద్రంలో దక్షిణాది ముఖ్యమంత్రుల దయనీయమైన వ్యవహారాన్ని ప్రత్యక్షంగా చూసి చలించిపోయిన ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదంతో చెలరేగిపోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వాల వైఖరిలో మార్పుచోటుచేసుకుంది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు గుర్తింపునిస్తూ రాజకీయాల్లో బాగస్వాములను చేస్తూ కేంద్రం సరైన అవకాశాలను కల్పించేందుకు ఆసక్తి చూపింది. ఇది తొలిసారిగా కేంద్రాలపై స్వర్గీయ ఎన్టీఆర్ సాధించిన విజయం. అందులోంచి పుట్టిందే నేషనల్ ఫ్రంట్.

టీడిపి పూర్వవైభవం దిశగా అడుగులు..చంద్రబాబు దిశానిర్దేశం

స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించేందుకు నారా చంద్రబాబు నాయుడు బిగించారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీని విజయతీరాలపైపు నడిపించి మామకు తగ్గ అల్లుడనిపించుకునన్నారు చంద్రబాబు. ఆనాడు ఎక్కడైతే పార్టీ పేరును ప్రకటించారో అదే ఆదర్శ్ నగర్ లో ఈ రోజు చంద్రబాబు పర్యటించనున్నారు. తర్వాత ఎన్టీఆర్ ఘాట్ లో స్వర్గీయ ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన తర్వాత ఎన్టీఆర్ భవన్ కు చేరుకుని 40సంవత్సరాల తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు చంద్రబాబు. ఈ సందర్బంగా నలభై వసంతాల ప్రస్థానాన్ని, విజయాను, పరాజయాలను, పార్టీ పూర్వవైభవం గురించి తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు దిశానిర్ధేశం చేయనున్నారు.

English summary
Forty years have passed since the founding of the Telugu Desam Party today (Tuesday). Wrap up the setbacks as well as the number of unbeaten wins recorded in these forty years. The Telugu Desam Party, which came to power within nine months of the party's announcement, has made political history.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X